ప్రపంచ కప్ పోటీలో సౌతాఫ్రికా తన మొదటి మ్యాచ్‌లోనే రికార్డుల వర్షం కురిపించి ప్రత్యర్థి జట్లకు హెచ్చరిక పంపింది. ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో జరిగిన తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై దక్షిణాఫ్రికా భారీ విజయం సాధించి ప్రపంచకప్‌లో తన ఉనికిని చాటుకుంది. ఈ మ్యాచ్‌లో, సౌతాఫ్రికాకు చెందిన 3 బ్యాట్స్‌మెన్ సెంచరీలు సాధించారు, దాని ఆధారంగా దక్షిణాఫ్రికా 428 పరుగుల ప్రపంచ రికార్డు స్కోరు చేసింది. వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఇదే అతిపెద్ద స్కోరు.
దక్షిణాఫ్రికా నిర్దేశించిన 429 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో శ్రీలంక జట్టు 44.5 ఓవర్లలో 326 పరుగులకే ఆలౌటైంది. ఈ విధంగా సౌతాఫ్రికా జట్టు శ్రీలంకపై 102 పరుగుల తేడాతో విజయం సాధించింది. దక్షిణాఫ్రికా తరఫున గెరాల్డ్ కోయెట్జీ మూడు వికెట్లు తీయగా, కగిసో రబడ, కేశవ్ మహరాజ్ చెరో 2 వికెట్లు తీశారు.
429 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు వచ్చిన శ్రీలంక జట్టుకు బ్యాడ్ స్టార్ట్ ఎదురైంది. ఓపెనర్ పాతుమ్ నిస్సాంకను మార్కో యానెసన్ వ్యక్తిగత స్కోరు సున్నా వద్ద పెవిలియన్‌కు పంపాడు. కుశాల్ పెరీరా కూడా ప్రత్యేకంగా ఏమీ చేయలేక 7 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఆ తర్వాత కుశాల్ మెండిస్ బాధ్యతలు స్వీకరించాడు. మెండిస్ కేవలం 25 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించి తన సత్తా చాటుకున్నాడు. అయితే ఆ తర్వాత అతడిని కగిసో రబాడ ఔట్ చేసి శ్రీలంకకు గట్టి దెబ్బ ఇచ్చాడు. మెండిస్ 42 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 76 పరుగులు చేసి ఔటయ్యాడు.
A stellar batting performance helps South Africa to a massive win in their #CWC23 clash against Sri Lanka 💪#SAvSL 📝: https://t.co/4jtdv0GMD8 pic.twitter.com/iwUmFw6Sg9
— ICC (@ICC) October 7, 2023
దక్షిణాఫ్రికా 5 వికెట్ల నష్టానికి 429 పరుగులు చేసింది..
అంతకు ముందు , శ్రీలంక కెప్టెన్ దసున్ షనక టాస్ గెలిచి దక్షిణాఫ్రికాను మొదట బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. దక్షిణాఫ్రికాకు మంచి ఆరంభం లభించలేదు. 10 పరుగుల స్కోరు కెప్టెన్ టెంబా బావుమా (8 పరుగులు) వికెట్ రూపంలో మొదటి దెబ్బ తగిలింది. ఆరంభంలోనే కెప్టెన్ వికెట్ కోల్పోయిన తర్వాత ఓపెనర్లు డికాక్, రాస్సీ వాన్ డెర్ డుసెన్ ఇన్నింగ్స్ బాధ్యతలు స్వీకరించి రెండో వికెట్‌కు 204 పరుగులు జోడించి భారీ స్కోరుకు పునాది వేశారు. 84 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 100 పరుగులు చేసి డి కాక్ ఔటయ్యాడు.
Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం గ్యాస్ స్టవ్ ఏ దిక్కున ఉంటే మంచిది ...
ఐడెన్ మార్క్రమ్ విధ్వంసం..
డి కాక్ ఔటయ్యాక దుసాన్ కు ఐడెన్ మార్క్రమ్ మద్దతు లభించింది. వీరిద్దరూ మూడో వికెట్‌కు 40 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దుసాన్ 110 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 108 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. అనంతరం మార్క్రామ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మార్క్రామ్ 49 బంతుల్లో సెంచరీ చేయడం ద్వారా వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీని నమోదు చేశాడు. 50 బంతుల్లో సెంచరీ చేసిన ఐర్లాండ్ బ్యాట్స్‌మెన్ కెవిన్ ఓబ్రెయిన్ రికార్డును బద్దలు కొట్టాడు. మార్క్రామ్ 54 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో రాణించాడు. డేవిడ్ మిల్లర్ 21 బంతుల్లో 39 పరుగులు చేసి నాటౌట్ గా వెనుదిరగగా, మార్కో యానెసన్ 7 బంతుల్లో 12 పరుగులు చేసి నాటౌట్ గా వెనుదిరిగాడు. దక్షిణాఫ్రికా తరఫున దిల్షాన్ మధుశంక అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టాడు.