Suryakumar Yadav Century (PIC@ IPL twitter)

Mumbai, May 12: మిస్టర్ 360 ప్లేయ‌ర్‌ సూర్యకుమార్ యాద‌వ్ (Suryakumar Yadav)  సెంచ‌రీ (103 నాటౌట్ :49 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్‌లు)తో చెల‌రేగాడు. సొంత గ్రౌండ్‌లో త‌న‌దైన షాట్లతో అల‌రించిన అత‌ను శ‌త‌కంతో ముంబైకి (Mumbai Indians) భారీ స్కోర్ అందించాడు. సూర్య మెరుపు ఇన్నింగ్స్ ఆడ‌డంతో ముంబై 5 వికెట్ల న‌ష్టానికి 218 ప‌రుగులు చేసింది. అల్జారీ జోసెఫ్ వేసిన 20వ ఓవ‌ర్లో సూర్యకుమార్ యాద‌వ్(103 నాటౌట్) నాలుగో బంతికి సిక్స్ బాదాడు. ఆఖ‌రి బంతికి సిక్స్ కొట్టి సెంచ‌రీ సాధించాడు. ఐపీఎల్‌లో అత‌నికి ఇదే తొలి సెంచ‌రీ. ముంబై స్కోర్ 200 దాటింది.

కామెరూన్ గ్రీన్ (2) 32 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌ల‌తో అర్థ శ‌త‌కం సాధించాడు. బ్యాటింగ్ పిచ్‌పై  ర‌షీద్ ఖాన్ 4 వికెట్ల‌తో స‌త్తా చాటాడు. ముంబై ఓపెన‌ర్లు ఇషాన్ కిష‌న్(31), రోహిత్ శ‌ర్మ‌(29)ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించారు. అయితే.. ప‌వ‌ర్ ప్లే త‌ర్వాత ర‌షీద్ ఖాన్ ఒకే ఓవ‌ర్లో ఇషాన్ కిష‌న్, రోహిత్ శ‌ర్మ ఔట్ చేశాడు. నేహ‌ల్ వ‌ధేర(15)ను బౌల్ట్  చేశాడు. విష్ణు వినోద్(30) ఔట‌య్యాడు. టిమ్ డేవిడ్(5) విఫ‌ల‌మ‌య్యాడు.