Suryakumar Yadav

Barbados, June 30: టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌లో T-20 Wol Cup Final( టీమ్​ఇండియా విజేతగా నిలిచింది. అంతర్జాతీయ వేదికపై రోహిత్​ సేన టీ20 వరల్డ్ కప్​ను చేజిక్కించుకుంది. శనివారం బార్బడోస్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్​లో భారత్​ 7 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో 17 ఏళ్ల తర్వాత భారత్‌ టీ20 ప్రపంచ కప్పును ముద్దాడింది. అయితే ఈ మ్యాచ్ గెల‌వ‌డానికి ముఖ్య కార‌ణం స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ (Surya Kumar Yadav) అందుకున్న క్యాచ్ (SKY Catch). అయితే టీమ్​ఇండియా (Team India) విజేతగా నిలిచిన అనంత‌రం సూర్య కుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ ట్రోఫీని త‌న బెడ్‌పై హ‌గ్ చేసుకొని ప‌డుకున్నాడు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

 

సౌతాఫ్రికా గెల‌వడానికి 6 బంతుల్లో 16 పరుగులు కావాలి. క్రీజులో డేవిడ్ మిల్లర్ (David mller) ఉన్నాడు. ఇక చివ‌రి ఓవ‌ర్‌ను కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యకు అప్ప‌గించ‌గా.. పాండ్య వేసిన తొలి బంతిని భారీ షాట్ కొట్టాడు మిల్ల‌ర్. ఆ బంతి అమాంతం గాల్లోకి లేచి సిక్సర్​వైపు దూసుకుపోయింది. ఇక లాంగాన్‌లో ఫీల్డింగ్​లో ఉన్న సూర్య పరిగెత్తుకుంటూ వచ్చి అంతుచిక్క‌ని రీతిలో బౌండరీ లైన్​ వద్ద బంతిని అందుకున్నాడు. దీంతో భార‌త్‌కు మ‌ళ్లీ విజ‌య అవకాశ‌లు చిగురించాయి. ఇక ఈ మ్యాచ్​లో సూర్య ఆ క్యాచ్ ప‌ట్ట‌కుంటే ఫ‌లితం వేరేలా ఉండేది. ఇక ల‌క్ష్య ఛేద‌న‌లో ద‌క్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవ‌ర్లలో 8 వికెట్ల న‌ష్టానికి 169 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది.