Danushka Gunathilaka Arrested

Sydney, NOV 10:  ఆస్ట్రేలియాలో అత్యాచారం కేసులో (Rape Casde) అరెస్టయిన శ్రీలంక క్రెకెటర్ ధనుష్క గుణతిలక (Danushka Gunathilaka ) మరిన్ని చిక్కుల్లో పడ్డాడు. ఇప్పటికే ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించింది. అంతేకాదు ఆయనపై విచారణకు శ్రీలంక క్రికెట్ బోర్డు ఓ కమిటీని నియమించింది. ఇక ధనుష్క చేసిన పనిపై ఆగ్రహావేశాలు రేకెత్తుతున్నాయి. మహిళ పట్ల అతను ప్రవర్తించిన తీరుపై నెటిజన్లు, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళ పట్ల ధనుష్క గుణతిలక (Danushka Gunathilaka ) చాలా దారుణంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. ఆమెను టిండర్ యాప్‌ లో పరిచయం చేసుకున్న అతను...నేరుగా కలుద్దామని ప్రపోజల్ పెట్టినట్లు యువతి తెలిపింది. వారిద్దరూ కలిసిన తర్వాత తనను బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడని, తన వెనుక భాగంలో కొట్టాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు తనను ఒకేరోజు నాలుగు సార్లు రేప్ చేశాడని, ఆ సమయంలో తనను ఊపిరి ఆడకుండా (choked) చేశాడని ఆరోపించింది.

ఇక సెక్స్ సమయంలో అతను కండోమ్ కూడా ధరించలేదని యువతి తెలిపింది. ధనుష్క గుణతిలక ఆమెను గొంతును బిగించి నరకం చూపించాడట . ఇలా పలుసార్లు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేయడంతో తీవ్రంగా గాయపడిందని, దీంతో బ్రెయిన్‌ స్కాన్‌ తీయించాల్సిన పరిస్థితి వచ్చిందని స్థానిక మీడియా కథనాలు తెలిపాయి. కాగా టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా సెమీఫైనల్‌కు చేరుకోలేకపోయింది. దీంతో ఆ జట్టు స్వదేశానికి పయనమవుతుండగానే అత్యాచారం ఆరోపణలపై గుణతిల్కాను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో అతను లేకుండానే లంకేయులు స్వదేశానికి బయలుదేరారు. ఈ ఘటన తర్వాత లంక ఆటగాడి తరఫున న్యాయవాది ఆనంద అమర్‌నాథ్‌ బెయిల్‌ కోరగా.. మేజిస్ట్రేట్‌ రాబర్ట్‌ విలియమ్స్‌ తిరస్కరించారు. ఈ విషయంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని అమర్‌నాథ్‌ చెప్పాడు.

Danushka Gunathilaka Arrest: శ్రీలంక క్రికెటర్ ధనుష్క గుణతిలక అరెస్ట్.. రేప్ ఆరోపణల నేపథ్యంలో అదుపులోకి తీసుకున్న సిడ్నీ పోలీసులు 

అయితే కేసు వివరాలను బయటకు రాకుండా చూడాలని దాఖలైన పిటిషన్‌ను మాత్రం మెజిస్ట్రేట్‌ రాబర్ట్‌ విలియమ్స్ అంగీకరిస్తూ గాగ్‌ ఆర్డర్ ఉత్తర్వులను జారీ చేశారు. కాగా ఓ ఆన్‌లైన్‌ డేటింగ్‌ యాప్‌లో పరిచయమైన మహిళపై ఈ నెల 2న లైంగిక హింసకు పాల్పడ్డాడన్న ఆరోపణలపై ఆదివారం సిడ్నీలో ధనుష్క అరెస్టయ్యాడు. దీంతో అన్ని రకాల క్రికెట్‌ నుంచి గుణతిలకను తక్షణమే నిషేధిస్తున్నట్లు శ్రీలంక క్రికెట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్‌ ఆడేందుకు వెళ్లిన శ్రీలంక జట్టులో గుణతిలక సభ్యుడే. అయితే తొలి మ్యాచ్‌ ఆడిన తర్వాత గాయపడటంతో మిగతా మ్యాచ్‌లకు దూరంగా ఉండిపోయాడు.

Danushka Gunathilaka: దనుష్క గుణతిలకను అన్ని ఫార్మాట్లను సస్పండ్ చేసిన శ్రీలంక క్రికెట్, అత్యాచార ఆరోపణలతో అరెస్ట్ అయిన శ్రీలంక బ్యాటర్ 

కాగా 2015లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగు పెట్టిన ధనుష్క ఇప్పటివరకు ఎనిమిది టెస్ట్, 47 వన్డే, 46 టీ20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. అయితే ఆటతోనే కాదు వివాదాలతోనూ వార్తల్లో నిలిచాడీ స్టార బ్యాటర్‌. 2018లో, గుణతిలక్ తన ఫ్రెండ్‌తో కలిసి ఓ నార్వేజియన్ మహిళపై అత్యాచారయత్నం చేశాడు. దీంతో శ్రీలంక క్రికెట్‌ బోర్డు అతనిపై 6 మ్యాచ్‌ల సస్పెన్షన్‌ విధించింది. అయినా తీరు మార్చుకోని ధనుష్క ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు