Abudabi November 11: టీ-20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌కు షాక్ ఇస్తూ ఫైనల్‌కు దూసుకెళ్లింది ఆస్ట్రేలియా. పాక్‌తో జరిగిన సెమీఫైనల్లో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి ఆస్ట్రేలియా ఒక దశలో 96 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తున్నట్లు కనిపించింది.
కానీ మార్కస్ స్టోయినిస్ 31 బంతుల్లో 40 పరుగులు, మాథ్యూ వేడ్ 17 బంతుల్లో 41 పరుగులు చేశారు. పోటాపోటీగా సిక్సర్లు, బౌండరీలు వర్షం కురిపించడంతో ఒక ఓవర్ మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. అంతకముందు డేవిడ్ వార్నర్ 49 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌తో ఆడాడు. పాకిస్తాన్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ 4 వికెట్లు తీశాడు. ఇక నవంబర్ 14 న జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తలపడనున్నాయి.
అంతకముందు పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ 67 పరుగులు చేయగా, ఫఖర్ జమాన్ 32 బంతుల్లో 55 పరుగులు చేశాడు. కెప్టెన్ బాబర్ అజమ్ 39 పరుగులు చేశాడు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 2, కమిన్స్, జంపా చెరో వికెట్ తీశారు.
ఇక 2015 ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో కూడా ఆస్ట్రేలియా. న్యూజిలాండ్ తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలిచింది.