టీ20 ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం న్యూజిలాండ్ వర్సెస్ స్కాట్లాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్16 పరుగుల తేడాతో స్కాట్లాండ్‌ని ఓడించింది. సెమీఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. అయితే ఈ విజయం టీమిండియా సెమీఫైనల్ ఆశలను గల్లంతు చేసింది. ఎందుకంటే గ్రూప్ 2 ప్రకారం.. ఈ రోజు న్యూజిలాండ్‌ని స్కాట్లాండ్ ఓడించడం చాలా ముఖ్యం. ఇది జరగలేదు.
తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. 56 బంతులు ఎదుర్కొన్న గప్టిల్ 6 ఫోర్లు, 7 సిక్సర్లతో 93 పరుగులు చేశాడే. గ్లెన్ ఫిలిప్స్ 33 పరుగులు చేశాడు. అనంతరం 173 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన స్కాట్లాండ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసి ఓటమి పాలైంది. కివీస్ బౌలర్లను స్కాట్లాండ్ బ్యాటర్లు దీటుగానే ఎదుర్కొన్నప్పటికీ, ఫలితం లేకుండా పోయింది.
స్కాట్లాండ్ బ్యాటర్ మైఖేల్ లీస్క్ 42 (నాటౌట్) పరుగులు చేయగా, జార్జ్ మున్సీ 22, మాథ్యూ క్రాస్ 27, రిచీ బెరింగ్టన్ 20 పరుగులు చేశారు. ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఓటమి పాలైన స్కాట్లాండ్‌కు ఇక ఇంటిముఖం పట్టినట్టే. వీరబాదుడతో 93 పరుగులు చేసిన మార్టిన్ గప్టిల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.