T20 World Cup 2022 Final: ఫైనల్‌ సమరానికి సర్వం సిద్ధం, మెల్బోర్న్‌ వేదికగా తలపడనున్న పాకిస్థాన్-ఇంగ్లండ్‌ జట్లు, ఫైనల్‌ మ్యాచ్‌కు వర్షం భయాలు, ఒకవేళ వాన పడితే ఏం చేస్తారో తెలుసా? ఇప్పటి వరకు ఇంగ్లండ్- పాక్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ల రికార్డులివీ!
PAK vs ENG Credit @ T20 World Cup Twitter

Melbourne, NOV 13: రసవత్తర సమరానికి వేళైంది. టీ20 ప్రపంచ కప్ -2022 ఫైనల్ మ్యాచ్ లో (T20 World Cup 2022 Final) ఇవాళ ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్థాన్ జట్లు (PAK vs ENG) తలపడనున్నాయి. ఇందుకు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (Melbourne Cricket Ground)వేదిక కానుంది. భారత కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 1.30 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభమవుతుంది. నాటకీయ పరిణామాల మధ్య అంతిమ సమరానికి చేరిన పాకిస్థాన్ జట్టు (PAK) 1992 ను పునరావృతం చేస్తుందా? పాక్ పై రికార్డుల్లో మెరుగ్గా ఉన్న ఇంగ్లాండ్ జట్టు గెలుస్తుందా అనేది అభిమానుల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో జరిగే ఫైనల్ మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉంది. వాతావరణ శాఖ వివరాల ప్రకారం. ఆదివారం మెల్‌బోర్న్‌లో వర్షం కురిసే అవకాశం చాలా తక్కువ అని చెబుతున్నాయి. ఒకవేళ వర్షం (Rain alert) పడి మ్యాచ్ నిలిచిపోతే పరిస్థితి ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.

సూపర్-12 మ్యాచ్‌ల సందర్భంగా వర్షం పడటంతో పలు జట్లకు ఐసీసీ చెరో పాయింట్ ఇచ్చింది. దీంతో ఆస్ట్రేలియా లాంటి జట్లకు ఇబ్బందికరంగా మారింది. అయితే ఫైనల్ మ్యాచ్ కు ఒకవేళ వర్షం పడే అవకాశాలు లేకపోలేదు. సూపర్-12 మ్యాచ్ ల సమయంలో వర్షం పడినా మ్యాచ్ ఫలితంకోసం కనీసం 10-10 ఓవర్లు ఆడటం అవసరం. కానీ, ఫైనల్ మ్యాచ్ లో ఐసీసీ (ICC) నిబంధనలు మార్చింది. ఫైనల్ మ్యాచ్ లో వర్షం వచ్చి మ్యాచ్ కు అంతరాయం ఏర్పడితే.. ఇరు జట్లు కనీసం 6-6 ఓవర్లు ఆడినప్పుడు డక్‌వర్త్-లూయిస్ నియమం వర్తిస్తుంది. మ్యాచ్ రోజు అంటే ఆదివారం వర్షం పడితే మరుసటి రోజు సోమవారం మ్యాచ్‌ నిర్వహిస్తారు. ఆ రోజు కూడా వర్షం పడి ఆట జరగక పోతే పాక్ – ఇంగ్లాండ్ జట్లు ట్రోఫీని పంచుకుంటాయి.

T20 World Cup 2022: టీమిండియాకు సెమీఫైనల్లో ఘోర పరాభవం, భారత్ విసిరిన 169 పరుగుల లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ చేధించిన ఇంగ్లండ్ ఓపెనర్లు, ఫైనల్లో అడుగుపెట్టిన బట్లర్ సేన 

ఇదిలాఉంటే ఫైనల్ మ్యాచ్ కోసం పాక్ – ఇంగ్లాండ్ జట్లు సన్నద్ధమయ్యాయి. గెలుపుపై ఇరు జట్లు దీమాను వ్యక్తంచేస్తున్నాయి. ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య ఇప్పటి వరకు 28 టీ20 మ్యాచ్ లు జరిగాయి. అందులో 18 మ్యాచ్ లలో ఇంగ్లాండ్ విజయంసాధించగా. పాకిస్థాన్ కేవలం తొమ్మిది మ్యాచ్ లలోనే విజయంసాధించింది. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. టీ20 ప్రపంచ కప్ లో పాక్ తో తలపడ్డ రెండుసార్లూ ఇంగ్లాండ్ జట్టే విజయం సాధించింది.