టీ20 వరల్డ్‌కప్-2024లో ఆదివారం(జూన్ 9)న న్యూయర్క్ వేదికగా భారత్-పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి.ఈ పోటీకి ముందే టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ గాయపడ్డాడు. పాక్‌తో మ్యాచ్‌కు ముందు నెట్ ప్రాక్టీస్‌లో రోహిత్ శర్మ బొటన వేలికి గాయమైంది. త్రోడౌన్ స్పెషలిస్ట్ నువాన్ వేసిన బంతి అనూహ్యంగా బౌన్స్ అయ్యి రోహిత్ చేతివేలికి తాకింది. వెంటనే వైద్య సిబ్బంది గ్రౌండ్‌లోకి పరిగెత్తుకుంటూ వచ్చి హిట్‌మ్యాన్‌కు చికిత్స అందించారు.
కానీ నొప్పి తగ్గు ముఖం పట్టకపోవడంతో రోహిత్ ప్రాక్టీస్ మధ్యలోనే వెనుదిరిగాడు. అయితే రోహిత్ గాయంపై టీమ్ మెనెజ్‌మెంట్ గానీ, బీసీసీఐ గానీ ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. ఒకవేళ రోహిత్ పాకిస్తాన్ మ్యాచ్‌కు దూరమైతే టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పుకోవాలి. కాగా అంతకుముందు ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పేసర్ మార్క్ అడైర్ వేసిన ఓ రాకాసి బౌన్సర్ హిట్‌మ్యాన్ మోచేతికి తాకింది. దీంతో రోహిత్ నొప్పితో విల్లవిల్లాడు. అయితే ఆ తర్వాత ఫిట్‌నెస్ సాధించిన హిట్‌మ్యాన్ అనుహ్యంగా మరోసారి గాయపడ్డాడు. ఆప్ఘన్ల చేతిలో న్యూజీలాండ్‌కు ఘోర పరాభవం, ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో 84 పరుగుల తేడాతో ఘన విజయం
ఇక న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్‌పై జరిగిన మ్యాచ్‌లో37 బంతుల్లో 52 పరుగులు బాదిన రోహిత్ శర్మ రిటైర్డ్ హర్ట్‌గా వెనుతిరిగాడు. తన ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు బాదిన హిట్‌మ్యాన్ వరల్డ్ రికార్డు సృష్టించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో 600 సిక్సర్లు బాదిన తొలి క్రికెటర్‌గా అవతరించాడు. ఐర్లాండ్‌పై కొట్టిన మూడు సిక్సర్లతో రోహిత్ శర్మ సిక్సుల సంఖ్య 600లకు చేరింది. దీంతో పాటుగా పురుషుల టీ20 క్రికెట్‌లో 4,000 పరుగులు చేసిన మూడవ బ్యాటర్‌గా కూడా రోహిత్ శర్మ నిలిచాడు. ఇక గత మ్యాచ్‌లో చేసిన 52 పరుగులతో టీ20 ప్రపంచ కప్‌లో 1,000 పరుగుల మార్కును హిట్‌మ్యాన్ అందుకున్నాడు.