IND VS BNG: విజయాలతో జోరుమీదున్న టీమిండియా! వరల్డ్ కప్‌లో ఇవాళ మరో ఇంట్రస్టింగ్ మ్యాచ్‌, పుణె వేదికగా బంగ్లాతో తలపడనున్న భారత్‌
India World Cup

Pune, OCT 19: స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో (ICC World Cup) హ్యాట్రిక్‌ విజయాలతో జోరు మీదున్న టీమ్‌ఇండియా ఇవాళ పుణె వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడనుంది. బలం, బలగం ప్రకారం పేపర్‌ మీద చూసుకుంటే.. బంగ్లాదేశ్‌ కన్నా రోహిత్‌ సేన ఎన్నో రెట్లు మెరుగ్గా ఉన్నా.. సమీప చరిత్ర మాత్రం భిన్నంగా కనిపిస్తున్నది. ఇటీవల ఆసియా కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన పోరులో భారత్‌ (IND Vs BNG) ఓటమి పాలవగా.. ద్వైపాక్షిక సిరీస్‌లోనూ ఆ జట్టు చేతిలో మనవాళ్లు ట్రోఫీ కోల్పోయారు. ఈ లెక్కలు చూస్తే ఇటీవలి కాలంలో బంగ్లా (Bangladesh) ఎంత ఎదిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ప్రపంచ చాంపియన్‌ ఇంగ్లండ్‌పై అఫ్గానిస్థాన్‌ విజయం సాధించి ప్రపంచకప్‌లో సంచలనం నమోదు చేస్తే.. దక్షిణాఫ్రికాపై గెలుపుతో నెదర్లాండ్స్‌ భూకంపం పుట్టించింది. ఆ జట్లను స్ఫూర్తిగా తీసుకొని బంగ్లా కూడా భారత్‌ను నిలువరించాలని గట్టి ప్రయత్నాలు చేస్తుంటే.. కప్పు దారిలో ఎదురైన వాళ్లందరినీ తుక్కు కింద కొట్టాలని టీమ్‌ఇండియా భావిస్తున్నది. తొలి పోరులో ఆస్ట్రేలియాను మట్టికరిపించిన రోహిత్‌ సేన ఆ తర్వాత వరుసగా అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌పై విజయదుందుభి మోగించింది.

World Cup 2023: ఎదురులేని న్యూజీలాండ్, వరుసగా నాలుగో విజయం నమోదు, 149 పరుగుల తేడాతో ఆఫ్గానిస్తాన్‌ను చిత్తు చేసిన కివీస్ 

ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ ఏ ఒక్కరి ప్రదర్శనపైనో కాకుండా.. జట్టు సమిష్టిగా సత్తాచాటి గెలువడం సానుకూలాంశం. డెంగ్యూ నుంచి కోలుకొని జట్టులోకి వచ్చిన యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌పై భారీ అంచనాలు ఉండగా.. రోహిత్‌ శర్మ (Rohit Sharma), విరాట్‌ కోహ్లీ (Virat Kohli) అదే జోరు కొనసాగించాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఆశిస్తున్నది. ఇక మిడిలార్డర్‌లో శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్యా కీలకం కానున్నారు. ఆల్‌రౌండర్లుగా రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌కు జట్టులో చోటు ఖాయమే. శార్దూల్‌ స్థానంలో మహమ్మద్‌ షమీ, అశ్విన్‌లో ఒకరిని ఆడించాలనే వ్యాఖ్యలు వినిపిస్తున్నా.. విన్నింగ్‌ కాంబినేషన్‌ను మార్చేది లేదని బౌలింగ్‌ కోచ్‌ పారస్‌ మాంబ్రే ప్రకటించాడు. అంటే ఈ మ్యాచ్‌లోనూ శార్దూల్‌ ప్లెయింగ్‌ ఎలెవన్‌లో ఉండనున్నాడు. స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌గా కుల్దీప్‌ యాదవ్‌ బాధ్యతలు నిర్వర్తించనుండగా.. జస్ప్రీత్‌ బుమ్రా, మహమ్మద్‌ సిరాజ్‌ పేస్‌ భారం మోయనున్నారు. మరోవైపు పాతికేండ్ల తర్వాత భారత గడ్డపై వన్డేల్లో టీమ్‌ఇండియాను ఎదుర్కోనున్న బంగ్లాదేశ్‌.. సంచలన ప్రదర్శన నమోదు చేయాలని తహతహలాడుతున్నది. షకీబ్‌ కోలుకున్నట్లే అని ఆ జట్టు కోచ్‌ పేర్కొనగా.. లిటన్‌దాస్‌,ముష్ఫికర్‌ రహీమ్‌, మహ్ముదుల్లా, ముస్తఫిజుర్‌ వంటి ప్రతిభావంతులతో కూడిన బంగ్లాను తక్కువ అంచనా వేసేందుకు లేదు. పుణె పిచ్‌ బ్యాటింగ్‌కు సహకరించే అవకాశాలెక్కువ. ఇక్కడ జరిగిన గత ఐదు మ్యాచ్‌ల్లో మూడింట తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్లు మూడొందల పైచిలుకు స్కోర్లు చేశాయి. వాతావరణం పొడిగా ఉండనుంది. సాయంత్రం చిరుజల్లులకు అవకాశం ఉంది.

ICC ODI Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన రోహిత్‌ శర్మ, ఏకంగా ఐదు స్ధానాలు ఎగబాకి ఆరో స్ధానం కైవసం, విరాట్‌ కోహ్లిని తొలిసారి అధిగమించిన టీమిండియా కెప్టెన్ 

వన్డే ప్రపంచకప్‌లో భారత్‌పై బంగ్లా ఒకే ఒక్కసారి (2007లో) విజయం సాధించింది.

భారత్‌లో భారత్‌తో వన్డేల్లో తలపడటం బంగ్లాదేశ్‌కు పాతికేండ్ల తర్వాత ఇదే తొలిసారి. 1998లో వాంఖడే వేదికగా టీమ్‌ఇండియాతో మ్యాచ్‌ అనంతరం ఆ జట్టు భారత గడ్డపై మన జట్టుతో వన్డే మ్యాచ్‌

తుది జట్లు (అంచనా)

భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), గిల్‌, కోహ్లీ, శ్రేయస్‌, రాహుల్‌, పాండ్యా, జడేజా, శార్దూల్‌, బుమ్రా, కుల్దీప్‌, సిరాజ్‌.

బంగ్లాదేశ్‌: షకీబ్‌ (కెప్టెన్‌), తన్జిద్‌, లిటన్‌, నజ్ముల్‌, తౌహిద్‌, ముష్ఫికర్‌, మెహదీ హసన్‌, మహ్ముదుల్లా, తస్కీన్‌, షరీఫుల్‌, ముస్తఫిజుర్‌.