వన్డే ప్రపంచకప్-2023లో న్యూజిలాండ్ వరుసగా నాలుగో విజయం నమోదు చేసింది. చెన్నై వేదికగా ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 149 పరుగుల తేడాతో కివీస్ గెలుపొందింది. 289 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్గానిస్తాన్.. కివీస్ బౌలర్ల దాటికి 139 పరుగులకు కుప్పకూలింది.
న్యూజిలాండ్ బౌలర్లలో శాంట్నర్, ఫెర్గూసన్ తలా మూడు వికెట్లతో ఆఫ్గాన్ పతనాన్ని శాసించగా.. బౌల్ట్ రెండు, రవీంద్ర ఒక్క వికెట్ పడగొట్టారు. ఆఫ్గాన్ బ్యాటర్లలో రెహమత్ షా(36) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది.
న్యూజిలాండ్ బ్యాటర్లలో ఫిలిప్స్(71) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. టామ్ లాథమ్(68), విల్ యంగ్(54) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఆఫ్గాన్ బౌలర్లలో నవీన్ ఉల్ హక్, ఒమర్జాయ్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. ముజీబ్,రషీధ్ ఖాన్ చెరో వికెట్ సాధించారు. ఇక ఈ విజయంతో పాయింట్ల పట్టికలో కివీస్(8 పాయింట్లు) అగ్రస్ధానానికి చేరుకుంది. తర్వాతి స్ధానంలో 6 పాయింట్లతో టీమిండియా ఉంది.
Here's News
Two more points on the board in Chennai! Lockie Ferguson 3-19 and Mitch Santner 3-39 leading the bowling effort. Scorecard | https://t.co/KwEW5rcWOQ #CWC23 pic.twitter.com/VLDdZqy6rh
— BLACKCAPS (@BLACKCAPS) October 18, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)