Image : Twitter

T20 World Cup 2021, India vs New Zealand:న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. ఆరంభం నుంచి న్యూజిలాండ్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో టీమిండియా బ్యాటర్స్‌ పరుగులు చేయడంలో ఇబ్బంది పడ్డారు. రవీంద్ర జడేజా 26 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. హార్దిక్‌ పాండ్యా 23 పరుగులు చేశాడు. మిగిలిన టీమిండియా బ్యాట్స్‌మెన్‌ దారుణంగా విఫలమయ్యారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో ట్రెంట్‌ బౌల్ట్‌ 3, ఇష్‌ సోథీ 2, సౌథీ, మిల్నేలు చెరో వికెట్‌ తీశారు. ఇదిలా ఉంటే టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీ సేనకు ఏ దశలోనూ కలిసి రాలేదు. 70 పరుగులకే ఇషాన్ కిషన్ (4), కేఎల్ రాహుల్ (18), రోహిత్ శర్మ (14), విరాట్ కోహ్లీ (9) వంటి కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. ఆదుకుంటాడనుకున్న పంత్ (12) కూడా బ్యాటెత్తేశాడు. హార్దిక్ పాండ్యా (23), రవీంద్ర జడేజా (26, నాటౌట్) చివర్లో కాసేపు క్రీజులో కుదురుకోవడంతో భారత్ ఆమాత్రం పరుగులైనా చేయగలిగింది.