Uppal Stadium Staff Protest: రాజ‌స్థాన్ వ‌ర్సెస్ హైద‌రాబాద్ మ్యాచ్ జ‌ర‌గ‌డం డౌటే? మెరుపు ధ‌ర్నాకు దిగిన ఉప్ప‌ల్ స్టేడియం సిబ్బంది, వేత‌నాల‌తో పాటూ కాంప్లిమెంట‌రీ పాస్ లు ఇవ్వ‌డం లేద‌ని ఆందోళ‌న‌
Uppal Stadium (PIC @ X)

Hyderabad, May 01: హైద‌రాబాద్ న‌గ‌రంలోని ఉప్ప‌ల్ స్టేడియంలో (Uppal Stadium staff) సిబ్బంది మెరుపు ధ‌ర్నాకు దిగారు. తమకు బోనస్, ఇంక్రిమెంట్లు ఇవ్వడం లేదని ఆరోపణలు చేస్తున్నారు. అదే స‌మ‌యంలో కాంప్లిమెంటరీ పాసులు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్నారు. సిబ్బంది ధ‌ర్నాకు దిగ‌డంతో గురువారం ఉప్ప‌ల్ మైదానంలో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ వ‌ర్సెస్ (RR) స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ (SRH) మ్యాచ్ పై ఉత్కంఠ నెల‌కొంది. స్టేడియంలో గ్రౌండ్ స్టాఫ్ సహా 94 మంది సిబ్బంది బుధవారం మధ్యాహ్నం మెరుపు ధర్నాకు దిగారు. ఆరు నెలలుగా బోనస్ ఇవ్వడం లేదని, ఇంక్రిమెంట్లు వేయడం లేదని చెబుతున్నారు. నిబంధనల ప్రకారం తమకు రావాల్సిన మ్యాచ్ టికెట్లను ఇవ్వకుండా హెచ్‌సీఏ (HCA) ఆఫీస్ బేరర్లు ఇబ్బంది పెడుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. జనవరిలో ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టెస్టు మ్యాచ్ సమయంలోనే అధ్యక్షుడు జగన్ మోహన్ రావు నాయకత్వంలోని కొత్త పాలక వర్గం ఇంక్రిమెంట్లు ఇస్తామని హామీ ఇచ్చిందని.. నాలుగు నెలలు గడిచినా దాన్ని ప‌ట్టించుకోలేద‌న్నారు.

T20 World Cup 2024 Squads: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌ కోసం తమ జట్లను ప్రకటించిన అన్ని దేశాలు, జూన్ 1 నుంచి 29వ తేదీ వ‌ర‌కు ఐసీసీ 2024 టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ 

కాగా.. రేపటి మ్యాచ్ కోసం రాజస్థాన్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు ప్రాక్టీస్ వస్తున్న సమయంలోనే సిబ్బంది ధర్నా చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇంత‌క‌ముందు చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ కు ముందు బ‌కాయిలు చెల్లించలేదని స్టేడియానికి విద్యుత్ సరఫరా నిలిపివేసిన ఘటనపై హెచ్ సీఏపై తీవ్ర విమర్శలు వ్య‌క్తం అయిన సంగ‌తి తెలిసిందే. టికెట్ల అమ్మకాలు, కాంప్లిమెంటరీ పాసుల జారీ, మ్యాచ్ ల సమయంలో స్టేడియం మెయింటెన్స్ తీరుపైనా కొత్త పాలక వర్గంపై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు స్టేడియం సిబ్బంది ధర్నాకు దిగడంతో హెచ్‌సీఏ పెద్దల వ్యవహారశైలిపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది.