virat-kohli-1

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వరుస వివాదాల్లో ఇరుక్కుంటున్నాడు. తాజాగా సౌతాఫ్రికా(South Africa)తో మూడో వన్డేకు ముందు జాతీయ గీతం జనగణమన(Jana Gana Mana) ఆలపిస్తుండగా విరాట్ కోహ్లీ చూయింగ్ గమ్ నములుతూ కనిపించాడు. దీంతో జాతీయ గీతం ఆలపిస్తుండగా కోహ్లీ వ్యవహరించిన నిర్లక్ష్యపు ధోరణికి ఫ్యాన్స్ తీవ్రంగా హార్ట్ అయ్యారు. అతడు చేసిన పనికి నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు. మూడో వన్డే ఆరంభానికి ముందు జట్టులోని మిగతా ప్లేయర్స్ అందరూ శ్రద్దగా జాతీయ గీతాన్ని ఆలపిస్తుండగా.. కోహ్లీ(Virat Kohli) మాత్రం ఎలాంటి పట్టింపు లేకుండా చూయింగ్ గమ్ నములుతూ కనిపించాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా కోహ్లీ ఇలా అనుచితంగా ప్రవర్తించడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేసింది. ఆన్ ఫీల్డ్‌లో ప్రవర్తించే తీరు ఎలా ఉన్నా ఫర్వాలేదు గానీ.. జాతీయ గీతం ఆలపించేటప్పుడు మాత్రం ఒళ్లు దగ్గర పెట్టుకుని ప్రవర్తించాలని కామెంట్స్ చేస్తూ నెటిజన్లు కోహ్లీపై ఫైరవుతున్నారు. దేశం కోసం ఆడటం ఇష్టం లేకపోతే తప్పుకోవాలని విమర్శిస్తున్నారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.