West Indies Out of T20 World Cup 2022

వన్డే ప్రపంచకప్ టోర్నీలో రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన వెస్టిండీస్ ఘోర అవమానం మూటగట్టుకుంది. మైదానంలో ఉత్కంఠభరితమైన పోరాటమే కాదు, స్లెడ్జింగ్, చిలిపి ఆటలు, డ్యాన్సులు, వేడుకలు, పార్టీలు ఇలా అన్నింటిలోనూ ఒకప్పుడు వెస్టిండీస్‌దే అగ్రస్థానం. అయితే ఈసారి మాత్రం అత్యంత అవమానకరమైన రీతిలో  ఐసీసీ వన్డే ప్రపంచకప్‌కు వెస్టిండీస్ జట్టు దూరమైంది. క్వాలిఫయర్స్‌లో పేలవ ప్రదర్శనతో వెస్టిండీస్ వన్డే ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించలేకపోయింది.

హరారేలో జరిగిన క్వాలిఫయింగ్ రౌండ్ సూపర్ సిక్స్ దశ మ్యాచ్‌లో వెస్టిండీస్ స్కాట్లాండ్‌తో ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో ఐసీసీ వన్డే ప్రపంచకప్ టోర్నీ నుంచి వెస్టిండీస్ నిష్క్రమించింది. స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్ వెస్టిండీస్‌కు డూ ఆర్ డై మ్యాచ్. ఈ మ్యాచ్‌లో గెలిస్తే వెస్టిండీస్ వన్డే ప్రపంచకప్ కల సజీవంగా ఉండేది. అయితే రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన వెస్టిండీస్ ఇప్పుడు వన్డే టోర్నీ నుంచి నిష్క్రమించనుంది.

1975, 1979లో ICC ODI ప్రపంచకప్ టోర్నమెంట్ ఛాంపియన్‌గా అవతరించిన వెస్టిండీస్ ఆ తర్వాత ఆధిపత్యం ప్రదర్శించలేకపోయింది. మరో విశేషమేమిటంటే.. వన్డే ఫార్మాట్‌లో వెస్టిండీస్‌ను స్కాట్లాండ్ ఓడించడం ఇదే తొలిసారి. క్వాలిఫయింగ్ రౌండ్‌లో శ్రీలంక, జింబాబ్వే 6 పాయింట్లతో దాదాపు అర్హత సాధించాయి. కానీ వెస్టిండీస్, నెదర్లాండ్స్, ఒమన్ జట్లు టోర్నీకి దూరంగా ఉన్నాయి.

క్వాలిఫయర్స్‌లో వెస్టిండీస్ పేలవ ప్రదర్శన చేసింది. వెస్టిండీస్ స్కాట్లాండ్‌పై 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. నెదర్లాండ్స్‌తో జరిగిన సూపర్ ఓవర్‌లో ఓడిపోయింది. జింబాబ్వేపై 35 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. క్వాలిఫయర్స్‌లో పేలవమైన ప్రదర్శన కారణంగా వెస్టిండీస్ వన్డే ప్రపంచకప్ టోర్నమెంట్‌కు అర్హత సాధించలేకపోయింది.

ఆధార్‌కు పాన్ లింక్ చేయకపోతే ఏమవుతుంది? ఎవరు ఆధార్-పాన్ కార్డ్ లింక్‌ చేయనవసరం లేదో ఓ సారి తెలుసుకోండి

స్కాట్లాండ్‌తో డూ ఆర్ డై మ్యాచ్‌లో వెస్టిండీస్ 181 పరుగులు చేసింది. కానీ స్కాట్లాండ్ 43.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఇదిలా ఉంటే భారత్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, అష్ఘనిస్థాన్, దక్షిణాఫ్రికా జట్లు నేరుగా ప్రపంచకప్‌కు అర్హత సాధించాయి.