
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆతిథ్య పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య కరాచీ వేదికగా తొలి మ్యాచ్ (ICC Champions Trophy 2025) జరుగుతున్నది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ భారీ స్కోరు సాధించింది.న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 320 పరుగులు భారీ స్కోరును సాధించింది.ఈ మ్యాచ్ లో విల్ యంగ్ బౌండరీల మీద బౌండరీలు కొడుతూ పాక్ బౌలర్లకు నరకం చూపించాడు. యంగ్ 113 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 107 పరుగులు చేసిన తర్వాత ఔటయ్యాడు. కాగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో అలరించాడు.
న్యూజిలాండ్ తరఫున చాంపియన్స్ ట్రోఫీలో సెంచరీ చేసిన నాలుగో బ్యాట్స్ మెన్ గా యంగ్ నిలిచాడు. గతంలో నాథన్ ఆష్లే, క్రిస్ కైర్న్స్, కేన్ విలియమ్సన్ కివీస్ జట్టు తరపున ఈ ఘనత సాధించారు. 2004లో అమెరికాపై ఆష్లే అజేయంగా 145 పరుగులు చేయగా.. 2000లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ చివరి మ్యాచ్‌లో క్రేన్స్ భారత్‌పై అజేయంగా 102 పరుగులు చేశాడు. 2017లో ఆస్ట్రేలియాపై కేన్ విలియమ్సన్ సెంచరీ సాధించాడు.
Will Young Slams First Century Video:
Champion stuff! 🙌🏻#WillYoung completes a scintillating century on his #ChampionsTrophy debut against the defending champions! 👏🏻💯
📺📱 Start watching FREE on JioHotstar: https://t.co/T07mgtb2xJ#ChampionsTrophyOnJioStar 👉 #PAKvNZ LIVE NOW on Star Sports 2 & Sports18-1 &… pic.twitter.com/yVyyxHuHcW
— Star Sports (@StarSportsIndia) February 19, 2025
ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌పై సెంచరీ చేసిన ప్రపంచంలో రెండో బ్యాట్స్‌మన్, న్యూజిలాండ్ తొలి బ్యాట్స్‌మన్‌గా యంగ్ (Will Young Slams First Century) నిలిచాడు. గతంలో శ్రీలంక మాజీ బ్యాట్స్‌మన్ సనత్ జయసూర్య ఐసీసీ ఈవెంట్‌లో పాక్‌పై సెంచరీ చేశాడు. 2002లో కొలంబోలో జరిగిన మ్యాచ్‌లో జయసూర్య అజేయంగా 102 పరుగులు చేశాడు.