australia

ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో  ఆస్ట్రేలియా జట్టు.. నెదర్లాండ్స్‌పై భారీ విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా  డేవిడ్ వార్నర్, గ్లెన్ మాక్స్‌వెల్‌ల సెంచరీల మోతతో 8 వికెట్లకు గానూ 399 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ జట్టు దారుణంగా తడబడి జట్టు మొత్తం 90 పరుగులకే కుప్పకూలింది. దీంతో 309 పరుగుల భారీ తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించి, ప్రపంచకప్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది.

ఆస్ట్రేలియా నిర్దేశించిన 400 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు వచ్చిన నెదర్లాండ్స్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి.  ఆస్ట్రేలియా బౌలర్లందరూ వికెట్లు తీశారు. మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, పాట్ కమిన్స్, మిచెల్ మార్ష్, ఆడమ్ జంపా తమ ఖాతాలో వికెట్లు వేసుకున్నారు.

మ్యాక్స్‌వెల్-వార్నర్‌ల రికార్డు బద్దలు కొట్టిన ఇన్నింగ్స్:

నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ మొదట  సెంచరీ సాధించగా, ఆ తర్వాత గ్లెన్ మాక్స్‌వెల్ తుఫాను ఇన్నింగ్స్ తో చెలరేగాడు. వార్నర్ 93 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 103 పరుగులు చేశాడు. అయితే గ్లెన్ మాక్స్‌వెల్ కేవలం 40 బంతుల్లో  సెంచరీ చేసి ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీని సాధించాడు.

ఐసీసీ ప్రపంచకప్‌లో రెండు వరుస పరాజయాలతో ప్రయాణం ప్రారంభించిన  ఆస్ట్రేలియా.. వరుసగా రెండు మ్యాచ్‌లోనూ 350కిపైగా స్కోరు చేసింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, గ్లెన్ మాక్స్‌వెల్ సెంచరీలతో పాటు స్టీవ్ స్మిత్, మార్నస్ లాబుషేన్ అర్ధ సెంచరీలు చేశారు. బ్యాట్స్‌మెన్‌ విజృంభణతో  నెదర్లాండ్స్‌పై ఆస్ట్రేలియా 8 వికెట్ల నష్టానికి 399 పరుగుల భారీ స్కోరు సాధించింది.

Vastu Tips: వాస్తు ప్రకారం ఇంటికి ఎన్ని ద్వారాలు ఉండాలి