ప్రపంచ కప్‌లో భారత్ మరియు ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించగా, కొద్దిసేపటికే రోహిత్ సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. రోహిత్ శర్మ ఇప్పుడు కెప్టెన్‌గా ప్రపంచకప్ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అయితే ఈ మ్యాచ్‌లో భారత్ ఆరంభం అంతగా రాణించలేదు. ఈ వార్త రాసే సమయానికి టీమ్ ఇండియా 12 ఓవర్లలో 87 పరుగులకే మూడు ప్రధాన వికెట్లు కోల్పోయింది. టీమ్ ఇండియా తరుపున శుభ్‌మన్ గిల్ 4 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత రోహిత్ 31 బంతుల్లో 47 పరుగులు చేసి భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో వికెట్ కోల్పోయాడు. రోహిత్ ఔట్ అయిన మరుసటి ఓవర్‌లో, బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా 6 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు క్రీజులో ఉన్న విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్‌పైనే టీం ఇండియా ఆశలు ఉన్నాయి.
> హిట్టింగ్ కోసం ప్రయత్నిస్తూ.. వికెట్లు కోల్పోతున్న భారత్
>> మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా
>> కేవలం 4 రన్స్ చేసి ఔట్ అయిన అయ్యర్
>> రోహిత్ శర్మ తర్వాత.. గ్రౌండ్ లోకి వచ్చిన అయ్యర్
>> 10.3 ఓవర్లలో కీలకమై మూడు వికెట్లు డౌన్..
>> ఓవర్ల చాలా ఉన్నాయి.. వికెట్లు తక్కువగా ఉన్నాయి
>> టాప్ ఆర్డర్ లో ముగ్గురు వెంట వెంటనే ఔట్
>> 10.3 ఓవర్లలో 81 పరుగులు చేసిన టీమిండియా.
>> రన్ రేట్ 7.59గా ఉంది..
🔴3 వికెట్ కోల్పోయిన భారత్ శ్రేయాస్ అయ్యర్ మూడు
బంతుల్లో ఫోర్ రన్స్ భారత్ స్కోర్93/3 (13.4) ఇండియా కు వరస షాకులు#INDvsAUSfinal #ICCWorldCupFinal #CWC23 #CWCFinal #ICCCricketWorldCup23 #NewsUpdate #bigtvlive pic.twitter.com/phcih1oKvG
— BIG TV Breaking News (@bigtvtelugu) November 19, 2023