Dipa Karmakar (Photo Credits: @IndiaSportsHub/X)

భార‌త స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ రిటైర్మెంట్ ప్ర‌క‌టించింది. సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌తో తన నిర్ణయాన్ని పంచుకుంది. రిటైర్మెంట్‌ తర్వాత కర్మాకర్‌ కోచ్‌గా లేదా మెంటార్‌ తన సెకెండ్‌ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. జిమ్నాస్టిక్స్ నుండి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నాను. చాలా ఆలోచించి ఈ నిర్ణ‌యాన్ని తీసుకున్నాను. ఇది అంత తేలికైన నిర్ణయం కాదు. కానీ నా కెరీర్‌కు విడ్కోలు ప‌ల‌క‌డానికి ఇదే స‌రైన స‌మయంగా భావిస్తున్నాను. జిమ్నాస్టిక్స్ నా జీవితంలో ఒక భాగం. నా కెరీర్‌లో ఎన్నో ఎత్తు ప‌ల్లాలు చ‌విచూశాను.

వీడియో ఇదిగో, ఒంటి చేత్తో డైవింగ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్ పట్టిన భారత వికెట్ కీపర్ రియా ఘోష్

నాకు ఐదేళ్లు ఉన్న‌ప్పుడు నా ఫ్లాట్ ఫుట్ కార‌ణంగా జిమ్నాస్ట్ కాలేనని చాలా మంది అన్నారు. కానీ ఇప్పుడు నా విజయాలను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. ప్రపంచ వేదికపై భార‌త్‌కు ప్రాతినిధ్యం వహించడం, పతకాలు సాధించడం నాకు ఎంతో ప్ర‌త్యేకం. ముఖ్యంగా రియో ​​ఒలింపిక్స్‌లో ప్రొడునోవా వాల్ట్‌ను ప్రదర్శించడం నా కెరీర్‌లో మరపురాని క్షణాల్లో ఒక‌టి" అని త‌న రిటైర్మెంట్ నోట్‌లో దీపా పేర్కొంది.

కాగా 2011 నేషనల్‌ గేమ్స్‌లో నాలుగు ఈవెంట్లలో బంగారు పతకాలు సాధించడంతో కర్మాకర్‌ ఓవర్‌ నైట్‌ స్టార్‌గా మారింది. ఆ తర్వాత ఆసియన్‌ గేమ్స్‌లోనూ గోల్డ్‌ మెడల్‌ గెలిచి చరిత్ర సృష్టించింది. ఆసియన్‌ గేమ్స్‌లో పసిడి పతకం సాధించిన తొలి భారత జిమ్నాస్ట్‌గా దీపా నిలిచింది. రియో ఒలిపింక్స్‌లో తృటిలో కాంస్య పతకాన్ని ఆమె చేజార్చుకుంది. దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో 77 పతకాలను తన ఖాతాలో వేసుకుంది. అయితే పారిస్‌ ఒలిపింక్స్‌ ఆర్హత సాధించడంలో 31 ఏళ్ల దీపా విఫలమైంది.