FIFA Suspends Luis Rubiales

Spain, AUG 26: స్పెయిన్‌ ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ చీఫ్‌ లూయిస్‌ రుబియాలెస్ (Luis Rubiales) తమ దేశ స్టార్‌ క్రీడాకారిణి జెన్నిఫర్‌ హెర్మోసోను (Jenni Hermoso) పెదాలపై బలవంతంగా ముద్దు పెట్టుకున్నందుకు తగిన మూల్యం​ చెల్లించుకున్నాడు‌. ఈ ఉదంతం అనంతరం స్పెయిన్‌లో చెలరేగిన ఆందోళనల నేపథ్యంలో రుబియాలెస్‌పై ఫిఫా సస్పెన్షన్‌ (FIFA suspends) వేటు వేసింది. ఈ సస్పెన్షన్‌ ప్రాథమికంగా 90 రోజుల పాటు అమల్లో ఉంటుందని ఫిఫా పేర్కొంది. సస్పెన్షన్‌తో పాటు రుబియాలెస్‌పై (Luis Rubiales) క్రమశిక్షణా చర్యలు కూడా ఉంటాయని తెలిపింది.

కాగా, స్పెయిన్‌ మహిళల ఫుట్‌బాల్‌ జట్టు జగజ్జేతగా అవతరించిన అనంతరం మెడల్స్‌ ప్రజెంటేషన్‌ సందర్భంగా రుబియాలెస్‌.. జెన్నిఫర్‌ హెర్మోసోను పెదాలపై బలవంతంగా ముద్దు పెట్టుకున్న విషయం తెలిసందే. ఆ సమయంలో రుబియాలెస్‌.. జెన్నిఫర్‌తో పాటు మిగతా క్రీడాకారిణులను కూడా చెంపలపై ముద్ద పెట్టుకుని అసభ్యకరంగా ప్రవర్తించాడు. రుబియాలెస్‌ నుంచి ఊహించని ఈ ప్రవర్తన చూసి జెన్నిఫర్‌తో పాటు అక్కడున్న వారంతా షాక్‌కు గురయ్యారు.

Asia Cup 2023: ఆసియా కప్ పూర్తి షెడ్యూల్ ఇదిగో, టైటిల్ ఫేవరేట్‌గా భారత్, ప్రపంచ కప్‌కు ముందు జరుగుతున్న ప్రతిష్ఠాత్మక పోరులో గెలుపు ఎవరిది.. 

ఈ ఉదంతంపై స్పెయిన్‌లో పెద్ద ఎత్తున ఆ​ందోళనలు చెలరేగాయి. ఓ మహిళలను అయిష్టంగా చుంబించడం సమర్ధనీయం కాదని స్పానిష్‌ ప్రజలు నిరసనలకు దిగారు. ఈ ఉదంతం స్పెయిన్‌లో రాజకీయ ప్రకంపనలకు దారి తీసింది. నిరసనలు, ఆందోళలను తీవ్రరూపం దాల్చడంతో ఆ దేశ ప్రధాని పెడ్రో సాంచెజ్‌ రంగంలోకి దిగారు. రుబియాలెస్‌ బాధ్యతాయుతమైన వివరణ ఇవ్వాలని సూచించారు. క్రీడా శాఖకు సంబంధించిన స్పానిష్‌ హై కౌన్సిల్‌ రుబియాలెస్‌పై చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలో ఫిఫా జోక్యం చేసుకుని రుబిమాలెస్‌పై తూలెసస్పెన్షన్‌ వేటు వేసింది.