Dubai, DEC 18: అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ (Lionel Messi) మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. ఫిఫా వరల్డ్ కప్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. ఈఫైనల్‌తో (World Cup final) కలిపి ఇప్పటివరకు మెస్సీ 26 మ్యాచ్‌లు ఆడాడు. దాంతో జర్మనీకి చెందిన లోథర్ మథాస్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇది మెస్సీకి కెరీర్‌లో చివరి వరల్డ్ కప్. దాంతో, ఆది నుంచి జట్టును సమర్థంగా నడిపిస్తూ ఫైనల్ దాకా తీసుకొచ్చాడు. అంతేకాదు ఫైనల్లో జట్టుకు తొలి గోల్ (Goal) అందించాడు. దాంతో ఈ టోర్నీలో అతను అరు గోల్స్ సాధించాడు. 35వ నిమిషంలో డీ మరియా గోల్ కొట్టడంతో అర్జెంటీనా 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. లూసెయిల్ స్టేడియంలో ఫ్రాన్స్‌తో జరిగిన ఫైనల్లో మెస్సీ 23వ నిమిషంలో పెనాల్టీ షూట్‌ను గోల్‌గా మలిచాడు.
35వ నిమిషంలో అందివచ్చిన అవకాశాన్ని డి మరియా సద్వినియోగం చేసుకొని గోల్ కొట్టాడు. మరోవైపు ఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటినా గెలవాలని, మెస్సీ (Messi) అదరగొట్టాలని కోరుతూ కోల్‌కతాలో పూజలు, యజ్ఞాలు కూడా నిర్వహించారు అభిమానులు. వీటికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
It happens only at #Kolkata ?? #ArgentinaVsFrance #Messi? #messifans #messivsmbappe #ArgentinaFrancia #FIFAWorldCup #FIFA23 pic.twitter.com/wB9DYzFKHg
— Kaushik (@K__Ganguly) December 18, 2022
వీధుల్లో లియోనెల్ మెస్సీ ఫ్లెక్సీలు పెట్టి, రోడ్డుపై యజ్ఞాలు చేశారు. పలువురు అభిమానులు అర్జెంటినా టీమ్ దుస్తులు ధరించి వీటిల్లో పాల్గొన్నారు. ఇంకొన్ని చోట్ల కొందరు పూజలు నిర్వహించారు. ఇలా పూజలు చేయడంపై కొందరు సానుకూలంగా స్పందిస్తే.. మరికొందరు విమర్శలు చేస్తున్నారు.