Kapil Parmar (Photo Credits: @narendramodi/X)

Paris, SEP 05: పారాలింపిక్స్‌లో(Paralympics) భార‌త క్రీడాకారులు రికార్డు స్థాయిలో ప‌త‌కాలు సాధిస్తున్నారు. విశ్వ‌క్రీడ‌ల చ‌రిత్ర‌లో అథ్లెటిక్స్, బ్యాడ్మింట‌న్‌లో దేశానికి తొలిసారి ప‌త‌కాలు రాగా.. తాజాగా జూడోలోనూ క‌పిల్ ప‌ర్మార్(Kapil Parmar) మెడ‌ల్ కొల్ల‌గొట్టాడు. పురుషుల 60 కిలోలు జే1 విభాగంలో క‌పిల్ కాంస్యంతో మెరిశాడు. దాంతో, జూడోలో భార‌త్‌కు ప‌త‌కం అందించి తొలి ఆట‌గాడిగా చ‌రిత్ర (Kapil Parmar Wins Historic Bronze) సృష్టించాడు.

Here's Video

 

రెండేండ్ల క్రితం పారాఆసియా గేమ్స్‌లో వెండితో మెరిసిన క‌పిల్.. పారిలింపిక్స్‌లోనూ ప‌త‌కంపై ఆశ‌లు రేపాడు. అయితే.. అత‌డు సెమీ ఫైన‌ల్లో నిరాశ‌ప‌రిచాడు. బ‌నిత‌బ ఖొర్ర‌మ్ చేతిలో 0-10తో ఓడి కాంస్య పోరుకు అర్హ‌త సాధించాడు. ఎలీల్ట‌న్ డె ఒలివెరాను చిత్తుగా ఓడించి కంచు మోత మోగించాడు. దాంతో, విశ్వ క్రీడ‌ల‌ జూడో పోటీల్లో క‌పిల్ దేశానికి తొలి ప‌త‌కం సాధించి పెట్టాడు. ప్ర‌స్తుతానికి పారాలింపిక్స్‌లో ఇప్ప‌టివ‌ర‌కూ భార‌త్ ఖాతాలో 25 ప‌త‌కాలు చేరాయి.

Paralympics 2024: భారత్ ఖాతాలో మరో పసిడి పతకం,ఆర్చరీ విభాగంలో బంగారు పతకం సాధించిన తొలి క్రీడాకారుడిగా హర్విందర్ సింగ్ రికార్డ్, 24కి చేరిన భారత్ పతకాల సంఖ్య 

వీటిలో ఐదు స్వ‌ర్ణాలు, తొమ్మిది ర‌జ‌తాలు, 11 కాంస్యాలు ఉన్నాయి.క‌పిల్‌ది మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని షివోర్ అనే గ్రామం. ఐదుగురు తోబుట్టువుల‌లో మ‌నోడు ఆఖ‌రివాడు. అత‌డి తండ్రి ఓ ట్యాక్సీ డ్రైవ‌ర్. చిన్న‌ప్పుడు క‌పిల్ పొలంలో నీళ్ల పంపును ముట్టుకున్నాడు. ఆ స‌మ‌యంలో విద్యుత్ ప్ర‌మాదం జ‌ర‌గ‌డంతో అత‌డు కోమాలోకి వెళ్లాడు. కొన్ని రోజుల‌కు కోలుకున్న క‌పిల్ ఆట‌ల‌పై దృష్టి పెట్టాడు.