Mary Kom (Photo Credit: @PTI_News/twitter)

New Delhi, JAN 25: భార‌త స్టార్ బాక్స‌ర్ మేరీకోమ్(Mary Kom) వీడ్కోలు వార్త‌ల‌పై స్పందించింది. తాను ఇంకా ఆట‌కు రిటైర్మెంట్ ప‌ల‌క‌లేద‌ని, మీడియాలో త‌న‌పై వ‌స్తున్న వార్త‌ల‌న్నీ అబ‌ద్దాలేన‌ని బాక్సింగ్ లెజెండ్ తెలిపింది. ‘మీడియా మిత్రులారా.. నేనింకా వీడ్కోలు ప‌ల‌క‌లేదు. నా మాట‌ల్ని మీరు మ‌రోలా అర్థం చేసుకున్నారు. ఒక‌వేళ రిటైర్మెంట్ ప్ర‌క‌టించాలి అనుకున్న‌ప్పుడు క‌చ్చితంగా మీడియా ముందుకు వ‌చ్చి నా నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టిస్తాను’ అని గురువారం వివ‌ర‌ణ ఇచ్చింది. ‘బుధ‌వారం నేను ఒక స్కూల్ ఫంక్ష‌న్‌కు వెళ్లాను. అక్క‌డ వాళ్ల‌లో స్ఫూర్తి నింపాల‌నే ఉద్దేశంతో నాకు ఇంకా ఆట‌లో చాలా సాధించాల‌ని ఉంది. కానీ నా వ‌య‌సు కార‌ణంగా ఒలింపిక్స్‌లో ఆడ‌లేను. ఇప్ప‌టికీ నేను ఫిట్‌నెస్‌పై దృష్టి పెడుతున్నా. రింగ్ నుంచి వైదొలగాలి అనిపించిన‌ రోజున మీ అంద‌రితో ఆ విష‌యాన్ని పంచుకుంటా అని అన్నాను. కానీ మీడియావాళ్లు మాత్రం ఏకంగా నేను రిటైర్మెంట్ ప్ర‌కటించాను అన్న‌ట్టు రాసారు’ అని 41 ఏండ్ల మేరీకోమ్ వెల్ల‌డించింది.

 

ఈశాన్య రాష్ట్రమైన మ‌ణిపూర్‌లో పుట్టి పెరిగిన మేరీ కోమ్ బాక్సింగ్‌లో ప‌లు రికార్డులు నెల‌కొల్సింది. భార‌త బాక్సింగ్‌లో ధ్రువ తార‌లా వెలుగొందిన ఆమె.. నిఖ‌త్ జ‌రీన్(Nikhat Zarin), ల‌వ్లీనా, పూజ‌తో మ‌రికొంద‌రు బాక్సింగ్‌ను కెరీర్‌మా ఎంచుకునేందుకు స్ఫూర్తినిచ్చింది. 48 కేజీల విభాగంలో మ‌హారాణిగా వెలుగొందిన ఆమె 2005, 2006, 2008తో పాటు 2010లోనూ వ‌ర‌ల్డ్ చాంపియ‌న్‌షిప్ టైటిల్ గెలిచి వారెవ్వా అనిపించింది. అంతేకాదు 2012 లండ‌న్ ఒలింపిక్స్‌లో కాంస్య ప‌త‌కంతో మెరిసిన మేరీ కోమ్ 2014 ఆసియా క్రీడ‌ల్లో భార‌త్‌కు స్వ‌ర్ణ ప‌తాకాన్ని అందించింది. 2018లో ఇద్ద‌రు క‌వ‌ల‌ పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చాక కొన్ని రోజులు ఆట నుంచి విశ్రాంతి తీసుకుంది.

 

అనంత‌రం రింగ్‌లో అడుగుపెట్టిన మేరీకోమ్ 5-0తో ఉక్రెయిన్ బాక్స‌ర్‌ను చిత్తు చేసి.. రికార్డు స్థాయిలో ఆరోసారి వ‌ర‌ల్డ్ చాంపియ‌న్‌షిప్ టైటిల్ సాధించింది. దాంతో ఆమె జీవిత క‌థ ఆధారంగా బాలీవుడ్‌లో ప్రియాంక చోప్రా లీడ్ రోల్‌లో 2014లో సినిమా వ‌చ్చింది. అయితే.. 2022లో కామ‌న్‌వెల్త్ క్రీడ‌ల ఎంపిక స‌మ‌యంలో ఆమె మోకాలికి గాయమైంది. అప్ప‌టి నంఉచి మేరీకోమ్ బాక్సింగ్‌కు దూరంగా ఉంటోంది.