Paris, AUG 04: మాజీ వరల్డ్ నంబర్ 1 నొవాక్ జకోవిచ్ (Novak Djokovic) తన కల సాకారం చేసుకున్నాడు. విశ్వ క్రీడల్లో ఏండ్లుగా ఊరిస్తున్న బంగారు పతకాన్ని Gold) కొల్లగొట్టాడు. కెరీర్‌లో 24 గ్రాండ్‌స్లామ్స్‌తో చరిత్ర సృష్టించిన జకో ఎట్టకేలకు పారిస్ ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ పట్టేశాడు. తొలిసారి ఒలింపిక్స్ ఫైనల్ చేరిన అతడు.. ఆదివారం మట్టి కోర్టులో హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో కార్లోస్ అల్కరాజ్(Carlos Alcaraz)పై అద్భుత విజయం సాధించాడు. ప్రపంచ టెన్నిస్‌లో అత్యుత్తమ ఆటగాళ్లు అయిన జకోవిచ్, అల్కరాజ్‌లు ఫైనల్లో కొదమ సింహాల్లా తలపడ్డారు. బలమైన సర్వ్‌లతో పాటు పోటాపోటీగా టై బ్రేక్ పాయింట్లు సాధిస్తూ అభిమానులను మునివేళ్లపై నిలబెట్టారు
NOVAK DJOKOVIC IS AN OLYMPIC CHAMPION 🥇🇷🇸#Tennis pic.twitter.com/sHU7KLDEtV
— Roland-Garros (@rolandgarros) August 4, 2024
. అయితే.. తొలి సెట్‌ను 7-6తో గెలుపొందిన జకో.. రెండో సెట్‌లోనూ జోరు చూపించాడు. అల్కరాజ్ సైతం గట్టి పోటీనిచ్చినా చివరకు జకోవిచ్‌దే పై చేయి అయింది. సెర్బియా స్టార్ 7-6, 7-6తో విజేతగా నిలిచాడు. దాంతో, విశ్వ క్రీడల్లో తొలి బంగారు పతకం కొల్లగొట్టాడు. ఇంతకుముందు బీజింగ్ విశ్వ క్రీడ(2008)ల్లో కాంస్యంతో సరిపెట్టుకున్న జకోవిచ్ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ పసిడిని ఒడిసిపట్టాడు. మ్యాచ్ ఆసాంతం అద్భుతంగా ఆడిన అల్కరాజ్‌కు నిరాశ తప్పలేదు. వింబుల్డన్ (Wimbledon) ఫైనల్లో జకోవిచ్‌ను ఓడించిన ఈ యువకెరటం ఒలింపిక్స్‌లో మాత్రం ఈ మ్యాజిక్ రిపీట్ చేయలేకపోయాడు. అరంగేట్ర ఒలింపిక్స్‌లో బంగారు పతకాన్ని ముద్దాడాలనుకున్న అతడి కల చెదిరింది.