London, July 16: టెన్నిస్ సూపర్ స్టార్ మారియా ష‌ర‌పోవా (Maria Sharapova) మ‌గ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. పిల్లోడికి థియోడ‌ర్ (Theodore) అని పేరు కూడా పెట్టేసింది. 5 సార్లు గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల‌ు సాధించిన మాజీ వ‌ర‌ల్డ్ నెంబ‌ర్ వ‌న్ ష‌ర‌పోవా ఒక‌ప్పుడు టెన్నిస్‌లో(Tennis ) రికార్డులు క్రియేట్ చేసింది. పెళ్లి నంతరం ఆటకు దూరమైన షరపోవా (Sharapova) ఇప్పుడు మగబిడ్డకు జ‌న్మ‌నిచ్చిన విష‌యాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) వేదికగా వెల్లడించింది. బ్రిటీష్ వ్యాపార‌వేత్త అలెగ్జాండ‌ర్ గిల్కేస్‌ను (Alexander Gilkes) అప్పట్లో ష‌ర‌పోవా పెళ్లాడింది. డిసెంబ‌ర్ 2020లో వీరిద్దరూ కలిశారు. అప్పటినుంచి వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. రెండేళ్ల తర్వాత జూలై 1న మగబిడ్డ థియోడ‌ర్ జ‌న్మించిన‌ట్లు షరపోవా పేర్కొంది.

 

View this post on Instagram

 

A post shared by Maria Sharapova (@mariasharapova)

ఏప్రిల్‌లో ష‌ర‌పోవా ప్రెగ్నెంట్ అంటూ ప్ర‌క‌టించింది. 2004లో వింబుల్డ‌న్‌, 2006లో యూఎస్ ఓపెన్‌, 2008లో ఆస్ట్రేలియా ఓపెన్‌, 2012, 2014లో ఫ్రెంచ్ ఓపెన్‌లో షరపోవా తన సత్తా చాటింది. 4.4 మిలియన్ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు ఉన్న షరపోవా తనయుడు థియోడర్‌ను (Theodore) చేతిలో పట్టుకుని ప్రేమగా పసివాడిని చూస్తున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ సందర్భంగా షరపోవా క్యాప్షన్ ఇచ్చింది. థియోడర్ VII.I.MMXXII. మా చిన్న కుటుంబంలోకి వచ్చాడని, ఎన్నో ఆనందాలను తెచ్చాడని చెప్పుకొచ్చింది షరపోవా.

Sachin Tendulkar: వైరల్ ఫోటో ట్వీట్ చేసిన సచిన్ టెండూల్కర్, స‌ర్ గ్యారీ సోబ‌ర్స్‌ను కలిశానంటూ ఫోటో షేర్ చేసిన లెజెండ్ 

వచ్చే ఏప్రిల్‌లో తన పుట్టినరోజు కోసం ఎదురుచూస్తున్న విషయాన్ని ఆమె వెల్లడించింది . షరపోవా గిల్క్స్ (42) 2018 నుంచి డేటింగ్‌లో ఉన్నారు. ఆ సమయంలో ఆమె వేలికి £300,000 డైమండ్ ఎంగేజ్‌మెంట్ ఉంగరాన్ని తొడిగాడు. అప్పటినుంచి వీరిద్దరూ డేటింగ్ కొనసాగించారు. రష్యన్ క్రీడాకారిణి షరపోవా ఫిబ్రవరి 2020లో టెన్నిస్ నుంచి తన రిటైర్మెంట్ ప్రకటించింది.

Lalit Modi – Sushmita Sen Dating: డేటింగ్‌లో లలిత్ మోడీ .. మాజీ ప్రపంచ సుందరి సుస్మితా సేన్‌తో మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న ఐపీఎల్ మాజీ ఛైర్మెన్ 

ఆగస్టు 2005లో కేవలం 18 ఏళ్ల వయస్సులో షరపోవా ప్రపంచ నం.1గా నిలిచింది. ఆమె తన కెరీర్‌లో మరో నాలుగుసార్లు ఆ స్థానాన్ని ఆక్రమించింది. అంతేకాదు.. షరపోవా ఐదు ప్రధాన టైటిళ్లను గెలుచుకుంది. ఫ్రెంచ్ ఓపెన్‌లో రెండు, ఆస్ట్రేలియన్, US ఓపెన్ ప్లస్ వింబుల్డన్‌లో ఒక్కొక్కటి దక్కించుకుంది. మొత్తంగా షరపోవా 36 టైటిళ్లను గెలుచుకుంది.