Andhra Pradesh government all set to launch 1,068 new 108 ambulances on July 1 (Photo-Twitter)

Amaravati, July 1: వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికే దిశగా ఏపీ సీఎం (AP CM YS Jagan) అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రజారోగ్య రంగంలో ప్రధానంగా అత్యవసర సేవలందించే 108, 104 అంబులెన్స్‌లను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. అత్యవసర వైద్య సేవలందించే 108, 104 సర్వీసులను (104,108 Services in AP) ఏకంగా 1,088 వాహనాలను నేడు సీఎం విజయవాడలోని బెంజ్ సర్కిల్ వద్ద లాంచ్ చేశారు. అత్యాధునికంగా తీర్చిదిద్దిన 1088 అంబులెన్సుల గురించి తెలుసుకోండి

లాంచ్ అనంతరం ఈ వాహనాలన్నీ జిల్లాలకు నేరుగా వెళ్లిపోనున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ (Late YSR) 108, 104 సర్వీసులను ప్రవేశపెట్టిన సంగతి విదితమే. సీఎం జగన్‌ వాటికి అత్యాధునిక వైద్య సేవలను జోడించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఇప్పటికే వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి రాష్ట్రంలో 95 శాతం కుటుంబాలకుపైగా ఆరోగ్యశ్రీ ద్వారా భరోసా కల్పించారు.

Here's Video

అనారోగ్యం లేదా ప్రమాదానికి గురైన వారిని వెంటనే ఆదుకునే 108 సర్వీసులో అత్యాధునిక వైద్య సేవలందించే ఏర్పాట్లు చేశారు. కొత్తగా 412 అంబులెన్స్‌లను కొనుగోలు చేసి, ఈ సర్వీసు కోసం సిద్ధం చేయగా, ఇప్పటికే ఉన్న వాటిలో 336 అంబులెన్స్‌లను కూడా వినియోగించనున్నారు. కొత్తగా సిద్ధం చేసిన 412 అంబులెన్స్‌లలో 282 బేసిక్‌ లైఫ్‌ సపోర్టు (బీఎల్‌ఎస్‌)కు సంబంధించినవి కాగా, 104 అడ్వాన్స్‌డ్‌ లైఫ్‌ సపోర్టు (ఏఎల్‌ఎస్‌)గా తీర్చిదిద్దారు. మరో 26 అంబులెన్స్‌లను చిన్నారులకు (నియో నేటల్‌) వైద్య సేవలందించేలా తయారు చేశారు.