Vijayawada, April 07: ఏపీ సీఎం జగన్ (AP CM Jagan)గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ (Governer harichandan) తో భేటీ అయ్యారు. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై గవర్నర్ కు సమాచారం ఇచ్చారు. కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ కార్యక్రమానికి గవర్నర్ ను ఆహ్వానించారు జగన్. ఈ నెల 11న మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ (Cabinet rejig)చేపట్టనున్నట్లు గవర్నర్‌కి తెలిపారు. అదే రోజున నూతన మంత్రులతో ప్రమాణ స్వీకారం (Swearing) చేయించాలని గవర్నర్‌ను కోరారు సీఎం జగన్ (CM Jagan). కాగా, గురువారం మధ్యాహ్నం 3 గంటలకి ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రస్తుత మంత్రులకు ఇదే చిట్టచివరి సమావేశం. ఈ భేటీలో పాలనా వికేంద్రీకరణలో భాగంగా నూతన జిల్లాల ఏర్పాటును కూడా గవర్నర్‌కి వివరించారు సీఎం జగన్. గత వారం రోజులుగా సొంత రాష్ట్రం ఒడిశా, ఢిల్లీ పర్యటనలో ఉన్న గవర్నర్.. మంగళవారం రాత్రే ఢిల్లీ నుంచి విజయవాడ రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. మంత్రివర్గ విస్తరణపై కసరత్తు చివరి దశకు చేరింది. ప్రస్తుత మంత్రివర్గంలో కొనసాగుతున్న కొందరిని తొలగించి కొత్త వారికి మంత్రి పదవులు అప్పగిస్తానని ఇప్పటికే సీఎం జగన్ స్పష్టం చేశారు. దీంతో ప్రస్తుత మంత్రివర్గంలో కొనసాగుతున్న వారిలో ఎవరుంటారు? ఎవరికి ఉద్వాసన పలుకుతారు? కొత్తగా ఎవరికి అవకాశం కల్పిస్తారు? అన్నది హాట్ టాపిక్ గా మారింది.
Andhra Pradesh Chief Minister Sri Y.S. Jagan Mohan Reddy called on Andhra Pradesh Governor Sri Biswabhusan Harichandan on a courtesy visit at Raj Bhavan on Wednesday.@AndhraPradeshCM @ysjagan pic.twitter.com/FoeSM7a3uA
— Governor of Andhra Pradesh (@governorap) April 6, 2022
మధ్యాహ్నం ప్రస్తుత మంత్రివర్గ సభ్యులతో సీఎం జగన్ భేటీ కానున్నారు. ఈ భేటీలో ఎవరు మంత్రి వర్గంలో స్థానం కోల్పోతున్నారు, ప్రస్తుతమున్న మంత్రుల్లో ఎవరు కొనసాగుతారనే దానిపై సీఎం జగన్ స్పష్టత ఇవ్వనున్నారు. ఎందుకు మంత్రివర్గ విస్తరణ చేయాల్సి వస్తోంది? ప్రస్తుతమున్న మంత్రివర్గంలో (Cabinet) ఉన్నవారిలో కొందరిని ఎందుకు కొనసాగించాలని అనుకుంటున్నారు అనే విషయాలపై మంత్రివర్గ భేటీలో జగన్ క్లారిటీ ఇస్తారని తెలుస్తోంది.
మంత్రులుగా తమ పదవులను కోల్పోయిన వారు సీఎం జగన్ కి మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు రాజీనామా పత్రాలు ఇవ్వనున్నారు. 10వ తేదీన కొత్తగా మంత్రివర్గంలో స్థానం పొందే వారికి సీఎం జగన్ సమాచారం ఇవ్వనున్నారు.
ఈ నెల 11 వ తేదీన మంత్రి వర్గ విస్తరణ, అదే రోజు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాబోయేది ఎన్నికల కాలం కానుండటంతో మంత్రి వర్గంలో తీసుకునేవారి విషయంలో జగన్ ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రాంతాలు, జిల్లాలు, కులాల సమీకరణలను దృష్టిలో ఉంచుకొని మంత్రి వర్గంలో కొత్తవారికి అవకాశం కల్పించబోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల వారికి మంత్రి వర్గ విస్తరణలో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.