
Vijayawada, Mar 4: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న తనతో డ్రైవరు అసభ్యంగా ప్రవర్తించినట్లు ఓ మహిళ సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. బాధిత మహిళ వివరాల ప్రకారం.. బంధువుల శుభకార్యానికి నెల్లూరు వచ్చి తిరిగి స్వగ్రామం వెళ్లేందుకు బుధవారం రాత్రి నెల్లూరు-విశాఖపట్నం ఇంద్ర ఏసీ బస్సులో అనకాపల్లి వరకు టికెట్ తీసుకొని ఎక్కినట్లు తెలిపారు. బస్సులో మొత్తం ముగ్గురు ప్రయాణికులే ఉన్నారన్నారు. ఒంగోలు తర్వాత డ్యూటీ మారిన డ్రైవర్ తన పక్క సీటులో కూర్చున్నాడు.
అన్ని సీట్లు ఖాళీ ఉండగా ఇక్కడ ఎందుకు కూర్చుంటున్నారని తాను ( female passenger ) అభ్యంతరం వ్యక్తం చేశానన్నారు. అతను ఫోన్ ఛార్జింగ్ కోసం కూర్చున్నట్లు తెలిపాడన్నారు. బస్సులో లైట్లు ఆర్పివేసిన అనంతరం తనతో డ్రైవర్ అసభ్యంగా (Bus driver misbehaves) ప్రవర్తించాడని ఆమె చెప్పారు. దాంతో వెనుక సీట్లో ఉన్న వృద్ధ ప్రయాణికుడిని సాయం కోరగా.. అతను పక్షవాతంతో బాధపడుతున్నానని, సాయం చేయలేనని చెప్పాడన్నారు. దాంతో ఫోన్ ద్వారా అనకాపల్లిలోని భర్తకు సమాచారం ఇచ్చినట్లు ఆమె వివరించారు. తెలిసిన వారి ద్వారా బస్సు విజయవాడ బస్టేషన్‌కు చేరుకున్నాక డ్రైవర్‌పై ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఆర్టీసీ యాజమాన్యం అసభ్యంగా ప్రవర్తించిన డ్రైవర్ ఎ.జనార్దన్‌ను అధికారులు తక్షణం విధుల నుంచి ( suspended in vijayawada) తప్పించారు. మరో డ్రైవర్‌ను ఏర్పాటు చేసి గురువారం తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో బస్సును పంపారు. ప్రయాణికురాలి ఫిర్యాదు మేరకు ఘటనకు కారణమైన డ్రైవర్‌పై ఆర్టీసీ విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.