AP Cabinet Meeting (photo-X/TDP)

Vjy, Sep 17: ఆంధ్రప్రదేశ్‌లో నూతన మద్యం విధానంపై చర్చించేందుకు సీఎం చంద్రబాబుతో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. ఈ విధానంపై మంత్రులు తమ అభిప్రాయాన్ని సీఎం చంద్రబాబుకు వివరించారు. వివిధ రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను ఉన్నతాధికారులు తెలిపారు. ఆరు రాష్ట్రాల నుంచి సేకరించిన సమాచారాన్ని అందజేశారు. పలు మార్పులు చేర్పులతో పాటు తదుపరి కార్యాచరణపై సీఎం పలు సూచనలు చేసినట్లు సమాచారం.

అక్టోబర్‌ 1 నుంచి నూతన మద్యం విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. గురువారంలోపు దీనిపై ప్రకటన వచ్చే అవకాశముంది. క్యాబినెట్‌ సమావేశంలో దీనిపై చర్చించిన అనంతరం నూతన మద్యం విధానాన్ని ఖరారు చేయనున్నారు. అనంతరం కొల్లురవీంద్ర, నాదెండ్ల మనోహర్, సత్య కుమార్, కొండపల్లి శ్రీనివాస్‌ల సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు.

ఏపీలో అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త మద్యం పాలసీ, ఐదుగురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు, వివరాలను వెల్లడించిన మంత్రి కొల్లు రవీంద్ర

ఈ సందర్భంగా మంత్రి కొల్లురవీంద్ర (Minister Kollu Ravindra) మాట్లాడుతూ.. సామాన్యుడికి అందుబాటులో ఉండేలా ఓ ప్రత్యేక బ్రాండ్‌ను తీసుకొస్తున్నామని అన్నారు. టూరిజం పాలసీలో 3, 4 నక్షత్రాల హోటళ్లలో అధికంగా వసూలు చేస్తున్నారనే రోపణలు వచ్చాయన్నారు. వాటిని ఎక్సైజ్, టూరిజం డిపార్టమెంట్‌లు కలిసి కుర్చోని సరిచేయనున్నామని తెలిపారు. జనాభా ఎక్కువగా ఉన్న సిటీలలో స్మార్ట్ స్టోర్‌ల ద్వారా మద్యాన్ని అందుబాటులో ఉండేలా చేస్తామన్నారు. గత పాలసీ సెప్టెంబర్‌తో ముగుస్తుందని.. దీనిలో భాగంగానే ప్రభుత్వ షాపులు వస్తాయా, ప్రైవేటా రేపు (బుధవారం) తేలుతుందని....కేబినెట్‌లో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగనుంది. కేబినెట్‌లో కొత్త మద్యం పాలసీకి మంత్రివర్గం ఆమోద ముద్ర వేయనుంది. వచ్చే నెల 1వ తారీకు నుంచి రాష్ట్రంలో కొత్త ఎక్సైజ్ పాలసీ అమలుపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. మద్యం పాలసీపై తమ ప్రతిపాదనలను కేబినెట్ ముందు మంత్రివర్గ ఉపసంఘం ఉంచనుంది. ఉపసంఘం ప్రతిపాదనలపై కేబినెట్‌లో చర్చ జరుగనుంది. అనంతరం నూతన మద్యం పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది.