Chandra Babu Meets Arudra

Vijayawada, June 14: కాకినాడ రూర‌ల్ రాయుడుపాలెంనకు చెందిన ఆరుద్ర (Arudra).. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును (Chnadrababu) కలిశారు. దివ్యాంగురాలైన ఆమె కుమార్తెకు రూ.10వేల పింఛను మంజూరు చేస్తామని, వైద్య ఖర్చుల కోసం రూ.5 లక్షలు సాయం చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఆమె ఆస్తి వివాదాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సాయం చేస్తుందని హామీ ఇచ్చారు. ఆరుద్ర కుమార్తె సాయిలక్ష్మిచంద్ర కొంతకాలంగా వెన్నెముక సమస్యతో బాధపడుతోంది. కుమార్తె వైద్యం కోసం ఇంటిని అమ్మేందుకు యత్నించిన ఆరుద్రను.. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతలు అడ్డుకున్నారు.

 

ఈ విషయంపై అనేక సార్లు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చినా.. జగన్‌ను కలవకుండా అప్పట్లో పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. న్యాయం జరగడంలేదనే బాధతో అప్పట్లో సీఎం క్యాంపు ఆఫీసు వద్దే ఆరుద్ర ఆత్మహత్యాయత్నం కూడా చేశారు. చంద్రబాబు దృష్టికి సమస్యను తీసుకెళ్లగా.. కూటమి అధికారంలోకి వచ్చాక ఆదుకుంటామని ఆమెకు హామీ ఇచ్చారు.