Representative Image

Vizianagaram, July 15: ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా రామభద్రపురంలో ఆరు నెలల చిన్నారిపై అత్యాచారం జరిగిన దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ విషాదం శనివారం చోటుచేసుకుంది. పిల్లల తల్లికి దూరపు బంధువు అని చెప్పబడుతున్న నిందితుడు వారి ఇంటికి వచ్చాడు, తల్లి 10 ఏళ్ల కుమార్తెతో కలిసి సమీపంలోని డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లో కిరాణా సామాను కొనడానికి వెళ్లింది.అప్పుడు కామాంధుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

పసికందుపై జరిగిన దారుణ ఘటన వివరాలను డీఎస్పీ శ్రీనివాస్‌ రామభద్రపురం పోలీసు స్టేషన్‌లో వెల్లడించారు. మండలంలోని గిరిజన గ్రామంలో శనివారం సాయంత్రం ఓ తల్లి తన ఆడబిడ్డను ఊయల్లో నిద్రపుచ్చి, దుకాణంలో సరకులు కొనేందుకు వెళ్లింది. పాప తల్లికి చిన్నాన్న (పిన్ని భర్త) అయిన ఇదే మండలం నేరెళ్లవలసకు చెందిన బోయిన ఎరుకన్న దొర రెండు రోజుల క్రితం వచ్చాడు. ఇంట్లో ఎవరూ లేని ఆ సమయంలో ఊయల నుంచి బిడ్డను తీసి, మద్యం మత్తులో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చిన్నారి బిగ్గరగా ఏడవటంతో ఇంటి పరిసరాల్లో ఉన్న 12 ఏళ్ల అక్క వచ్చింది. పసికందుకు రక్తస్రావం అవుతుండటం చూసి.. తల్లికి చెప్పింది.  ఈ వార్త చదివాక.. అసలు వీడు మనిషేనా? అంటారు.. 60కిపైగా కుక్కలను రేప్ చేసి చంపాడు మరి..! క్రూరుడైన ఆ జువాలజిస్ట్ కు 249 ఏళ్ల జైలుశిక్ష పడే చాన్స్.. అసలేంటా విషయం??

ఈ క్రమంలో పారిపోతున్న నిందితుడిపై అనుమానంతో తల్లి కర్ర పట్టుకొని వెంబడించింది. గ్రామస్థులు కూడా పట్టుకునే ప్రయత్నం చేసినా.. పరారయ్యాడు. చిన్నారిని బాడంగి సీహెచ్‌సీకి, అక్కడి నుంచి విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పసికందు ఆరోగ్యం నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు చెప్పారు. ఆదివారం ఉదయం కామాంధుడ్ని పట్టుకొని, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. బాధిత కుటుంబాన్ని విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజుతో కలిసి మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ పరామర్శించారు. ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ డీవీజీ శంకరరావు చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

ఈ ఘటనను రాష్ట్ర గిరిజన, మహిళా - శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తీవ్రంగా ఖండించారు. నిందితుడిని వీలైనంత త్వరగా శిక్షించేందుకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బాధిత కుటుంబాన్ని ఆదివారం విజయనగరంలోని ఘోషాసుపత్రిలో పరామర్శించి, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు.