వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నానికి ఘోర అవమానం ఎదురైంది. ఆయనపై కొందరు యువకులు కోడిగుడ్లు విసిరారు. పేర్ని నాని గుడివాడలోని తోట శివాజీ ఇంటికి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు అక్కడకు వచ్చారు. తోట శివాజీ ఇంటి ముందు పేర్ని నానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ఆందోళనకు దిగారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వీడియో ఇదిగో, అక్కడ కెమెరాలు లేవు.. వీడియోలు లేవు, విచారణకు ముందే గుడ్లవల్లేరు కాలేజీ ఘటనపై తేల్చేసిన మంత్రి నారా లోకేశ్
ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన జనసైనికులు పేర్ని నానిపై ఒక్కసారిగా కోడిగుడ్లు విసిరారు. మరికొందరు పేర్ని నాని కారును ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. ఈ దాడిలో నాని కారు అద్దాలు పగిలాయి. అలర్ట్ అయిన పోలీసులు జనసైనికులను అదుపు చేశారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో జనసైనికులకు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
Here's Videos
కృష్ణాజిల్లా గుడివాడ
గుడివాడలో ఉద్రిక్త పరిస్థితులు...... పేర్ని నాని రాకతో జన సైనికుల ఆందోళన.
మాజీమంత్రి పేర్ని నానికి గుడివాడలో ఘోర అవమానం.... కోడిగుడ్లతో దాడి చేసిన యువత.
గుడివాడలో వైకాపా నేత ఇంటికి వచ్చిన పేర్ని నాని.
పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు....… pic.twitter.com/VUVvHTACph
— RTV (@RTVnewsnetwork) September 1, 2024
గుడివాడలోని వైసీపీ నేత తోట శివాజీ ఇంటికి వెళ్లిన మాజీ మంత్రి పేర్నినాని కారుపై జనసైనికులు రాళ్ళ దాడి చేయడం సిగ్గుచేటు. రాష్ట్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులను చూస్తుంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేక రాక్షస పాలనలో ఉన్నామా?… pic.twitter.com/CCh78ADdDA
— YSR Congress Party (@YSRCParty) September 1, 2024
మరోవైపు ఘర్షణ సందర్భంగా పేర్ని నానికి జనసైనికులు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పవన్ కు క్షమాపణ చెప్పేంత వరకు గుడివాడ దాటి వెళ్లనివ్వబోమని హెచ్చరించారు. చెప్పులు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చారు. మహిళలను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వ్యక్తిని పరామర్శించేందుకు పేర్ని నాని గుడివాడకు రావడం సిగ్గుచేటని విమర్శించారు. గతంలో రెండు చెప్పులతో పవన్ ను పేర్ని నాని అవమానించారని... ఇప్పుడు 36 చెప్పులు రెడీగా ఉన్నాయని అన్నారు. ఈ క్రమంలో, అక్కడి నుంచి పోలీసుల అండతో పేర్ని నాని వెళ్లిపోయారు.