Minister Botsa Satyanarayana (Photo-Twitter)

Amaravati, Mar 3: ప్రజలకు పరిపాలనను దగ్గరికి తీసుకురావడానికే తమ ప్రభుత్వం పనిచేస్తున్నదని, దానికే వంద శాతం కట్టుబడి ఉన్నామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) తెలిపారు. పరిపాలన వికేంద్రీకరణే తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. రాజధానిని నిర్ణయించుకునే అధికారం రాష్ట్రానిదే అని వెల్లడించారు. సీఆర్డీఏ చట్టాలన్ని అమలు చేస్తున్నామని, హైకోర్టు కూడా ఇవాళ అదే చెప్పిందన్నారు. ఈ చట్టం అమలుకు మేం వ్యతిరేకం కాదని తెలిపారు.

మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ.. రాజధానిని (AP Capital) నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే అనే విషయాన్ని పార్లమెంట్‌లో స్పష్టంగా చెప్పారు. మా విధానానికి నూటికి నూరు శాతం కట్టుబడి ఉన్నాం. రాజధాని అంటే భూములు, ఓ సామాజిక వర్గం కాదు. ఇతర ప్రాంత ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలి. ప్లాట్ల అభివృద్ధి 3 నెలల్లో సాధ్యమవుతుందా..?. సీఆర్డీఏ చట్టం అమలుకు మేం వ్యతిరేకం కాదు. ఏదైనా సమాఖ్య వ్యవస్థకు లోబడి ఉండాలి. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేదే మా ప్రభుత్వం ఉద్దేశ్యం.

హైకోర్టు తీర్పుపై కొన్ని మీడియా సంస్థలు వక్రభాష్యం చెబుతున్నాయి. ఈ విషయంపై సుప్రీంకోర్టుకు (SC) వెళ్లాల్సిన అవసరం లేదు' అని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. చ‌ట్టప‌రంగా ఉన్న అవ‌కాశాలను ప‌రిశీలించి అదే విధంగా చేస్తామన్నారు. హైకోర్టు తీర్పుపై న్యాయ సలహా తీసుకుంటామన్నారు. సుప్రీంకోర్టుకి వెళ్లాలా లేదా అనేది ఆలోచిస్తామన్నారు. అమరావతిపై హైకోర్టు తీర్పు విషయంలో సీఎం ఎందుకు క్షమాపణ చెప్పాలని మంత్రి బొత్స అన్నారు.

రాజధానిపై మంత్రి బొత్సా కీలక వ్యాఖ్యలు, తీర్పు ఊహించిందే.. త్వరలో మూడు రాజధానుల బిల్లులు పెడతాం, తీర్పు పూర్తిగా చదివాక అన్ని విషయాలపై మాట్లాడతామని తెలిపిన మంత్రి

రాజ్యాంగ హక్కుల ప్రకారం చట్టాలను రూపొందించే హక్కు అసెంబ్లీకి ఉంది. అలాగే భూములు ఇవ్వడానికి గడువు విధించడంపై బొత్స సత్యనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నాం, ఇక ముందు కూడా వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకునే రాజధానుల ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇదే సమయంలో శివరామకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికను అప్పటి ప్రభుత్వం ఎందుకు పరిగణలోకి తీసుకోలేదని ప్రశ్నించారు. చంద్రబాబు సమాజం కోసం కాకుండా తన సామాజికవర్గం కోసం పనిచేశాడని వ్యాఖ్యానించారు.

అమరావతి రాజధానిగా ఆరునెలల్లో అభివృద్ధి పనులన్ని పూర్తి చేయండి, ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు, మూడు రాజధానుల అంశంపై తుది తీర్పును వెల్లడించిన ధర్మాసనం

మూడు రాజధానుల ఏర్పాటుకు (Three Capitals) తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ప్రభుత్వం త్వరలో మూడు రాజధానుల బిల్లులను రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నదని తెలిపారు. మూడు రాజధానులు ఏర్పాటు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, పాలనను వికేంద్రీకరించడానికి అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడం తమ విధానమని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో రెండు, మూడు రాజధానుల ఏర్పాటుకు లేని అభ్యంతరాలు ఇక్కడ ఎందుకని ఆయన ప్రశ్నించారు.