PM Modi Bhimavaram Tour: ఆంధ్ర రాష్ట్రం ఒక పుణ్యభూమి అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ, కొనసాగుతున్న పీఎం ప్రసంగం
PM Modi Bhimavaram Tour Live

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ప్రధాని మోదీ.. ఆంధ్ర రాష్ట్రం ఒక పుణ్యభూమి అని.. ఇలాంటి పుణ్యభూమికి రావడం సంతోషంగా ఉందన్నారు. అజాదీకా అమృత్‌ మహోత్సవాలు జరుగుతున్న వేళ.. అల్లూరి 125వ జయంతి వేడుకలు జరుపుకుంటున్నామన్నారు. మన్యం వీరుడు, తెలుగు జాతి యుగ పురుషుడు అల్లూరి అని ప్రధాని కొనియాడారు. యావత్‌ దేశానికి అల్లూరి సీతారామరాజు స్ఫూర్తి అన్నారు. భీమవరం పట్టణంలో ఏర్పాటు చేసిన 30 అడుగుల సీతారామరాజు విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు.

అంతకుముందు సీఎం జగన్ మాట్లాడారు.. ఒక మనిషిని.. ఇంకొక మనిషి.. ఒక జాతిని మరొక జాతి.. ఒక దేశాన్ని మరొక దేశం దోపిడీ చేయడానికి వీల్లేని సమాజాన్ని స్వాతంత్ర్య సమరయోధులు ఆకాంక్షించారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం లక్షలాది మంది ప్రాణాలు అర్పించారన్నారు. అల్లూరి ఒక మహా అగ్ని కణం.. ఆయన తెలుగు గడ్డపై పుట్టడం గర్వకారణమని సీఎం జగన్‌ అన్నారు.