Vallabhaneni Vamsi (PIC@ Twitter)

Vjy, August 14: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఊరట లభించింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ ముందస్తు బెయిల్ దాఖలు చేశారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా.. ఈ నెల 20 వరకు ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 20కి న్యాయస్థానం వాయిదా వేసింది. సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లకు ఏపీ డీజీపీ షాక్, హెడ్ క్వార్టర్స్‌లో అందుబాటులో లేని ఐపీఎస్‍లకు మెమో, 16 మంది అధికారులకు షాకిచ్చిన డీజీపీ

గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వల్లభనేని వంశీ మాత్రం ఇప్పటి వరకూ దొరకలేదు. అయితే ఆయనను అరెస్ట్ చేయడానికి ప్రత్యేక బృందాలు పలు ప్రాంతాలకు బయలుదేరి వెళ్లాయి. దీంతో వల్లభనేని వంశీ తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు.తాజాగా హైకోర్టు తీర్పును వెలువరించింది.