AP Shocker: బంగారు నగల కోసం మహిళ దారుణ హత్య, విజయవాడ రైల్వే క్వార్టర్స్‌ మహిళ మర్డర్ కేసును చేధించిన పోలీసులు, ఆరుగురు నిందితులు అరెస్ట్

దొంగిలించిన చోరీ సొత్తును విక్రయించేందుకు ప్రయత్నించిన ఇద్దరు నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో (6 Including Juvenile Held) కేసు చిక్కుముడి వీడింది.

AP Shocker: బంగారు నగల కోసం మహిళ దారుణ హత్య, విజయవాడ రైల్వే క్వార్టర్స్‌ మహిళ మర్డర్ కేసును చేధించిన పోలీసులు, ఆరుగురు నిందితులు అరెస్ట్
Representational Image | (Photo Credits: IANS)

Vijayawada, July 20: ఏపీలోని విజయవాడ సత్యన్నారాయణ పురం రైల్వే క్వార్టర్స్‌లో నివసించే మహిళ గత వారం దారుణ హత్యకు గురైన సంగతి విదితమే. బెజవాడలోని రైల్వే సిగ్నల్‌ అండ్ టెలికాం విభాగంలో పనిచేసే సత్యనారాయణ ఆఫీసుకు వెళ్లిన సమయంలో దుండగులు అతని భార్యను హతమార్చి (50-Year-Old Woman Murdered) విలువైన ఆభరణాలను ఎత్తుకుపోయారు. ఈ కేసు పోలీసులకు సవాల్ గా మారింది. ఎట్టకేలకే ఈ కేసును విజయవాడ పోలీసులు చేధించారు.

మొబైల్‌ టవర్ల డంప్‌ను శోధించి నిందితుల్ని గుర్తించారు. దర్యాప్తులో బాగంగా సంఘటనా స్థలంలో క్లూస్ టీం, పోలీస్ జాగిలాల సహకారంతో సేకరించిన సమాచారంతో పాటు మొబైల్ ట్రాకింగ్ ద్వారా అనుమానిత వ్యక్తులు మరియు పాత నేరస్తులపై నిఘా ఉంచారు. దొంగిలించిన చోరీ సొత్తును విక్రయించేందుకు ప్రయత్నించిన ఇద్దరు నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో (6 Including Juvenile Held) కేసు చిక్కుముడి వీడింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ శివార్లలోని ముస్తాబాద్ గ్రామానికి చెందిన గుమ్మడి నాగేశ్వర రావు తాపీ పనులు చేస్తుంటాడు. ఇతని వద్ద ఐదారుగురు కూలీలు పనిచేస్తున్నారు. రైల్వేలో పనిచేసే నూతంగి సాంబశివరావు ద్వారా రైల్వే టెలికాం డిపార్ట్మెంట్‌లో టెక్నిషియన్‌గా పనిచేస్తున్న కట్టుంగ సత్య నారాయణ వద్ద విలువైన పాత వస్తువులు ఉన్నాయని వీరు తెలుసుకున్నారు. పాతకాలం నాటి వస్తువులకు మార్కెట్లో డిమాండ్‌ ఉంటుందని వాటిని దొంగిలించేందుకు వ్యూహం రచించారు. ఈ నేపథ్యంలోనే నాగేశ్వరరావు తన కుమారుడికి ప్లాన్ గురించి చెప్పాడు. అతనితో పాటు తన వద్ద పని చేసే గాలంకి సతీష్, కోట శ్రీమన్నారాయణ, బండ్ల గణేష్‌లకు చెప్పాడు.

డీఎస్పీ హత్య తరహాలోనే.. మహిళా ఎస్సైని లారీతో తొక్కించిన మరో మాఫియా, ఝార్ఖండ్‌ రాజధాని రాంచీలో దారుణ ఘటన

పథకం ప్రకారం జులై 9న సత్యన్నారాయణ ఇంటి నుండి బయటకు వెళ్ళగానే, వంశీకృష్ణ మృతురాలి ఇంటికి వెళ్లి అడ్రస్ అడుగుతునట్లు నటించాడు. అదే సమయంలో గాలంకి సతీష్, కోట శ్రీమన్నారాయణ లు వెనుక గోడ దూకి ఇంట్లో ప్రవేశించాారు. ఇంట్లోకి వచ్చిన వారిని ఆమె చూడటంతో అరిస్తే కత్తితో పొడుస్తామని బెదిరించి, ఆమె ముక్కు, నోటిని పక్కన వున్న టవల్ తో కట్టివేసి, ఆమెకు ఊపిరి ఆడకుండా చేశారు. ఇంకో టవల్ తో కాళ్ళు చేతులు కట్టేసిన తర్వాత దొంగతనం బయట పడుతుందనే ఉద్దేశంతో మరొక టవల్ ఆమె మెడకు చుట్టి చెరోపక్క గట్టిగా లాగి గొంతు బిగించి (Woman Murdered,) చంపేశారు. చనిపోయిందని నిర్ధారించుకున్నాక హతురాలి ఒంటిపైన ఉన్న బంగారు నగలను తీసుకుని పారిపోయారు.

ఈ తతంగాన్ని తాపీమేస్త్రీ గుమ్మడి నాగేశ్వరరావు రైల్వే పార్కులో ఉండి పర్యవేక్షించాడు.కోట శ్రీమన్నారాయణ, గాలంకి సతీష్‌లు దొంగిలించిన బంగారపు వస్తువులలో వారి వాటాగా వచ్చిన బంగారాన్ని అమ్ము కునే ప్రయత్నాల్లో పోలీసులకు దొరికిపోయారు. వారు ఇచ్చిన సమాచారంతో కానూరు మురళి నగర్ లో ఒక ఇంటిలో మిగిలిన నలుగురు నిందితులను అదుపులోనికి తీసుకున్నారు. నిందితుల నుంచి చోరీ సొత్తుతో పాటు నేరానికి వాడిన కారు, బైకుల్ని స్వాధీనం చేసుకున్నారు.

(The above story first appeared on LatestLY on Jul 20, 2022 05:32 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).