Accident (Credits: Wikimedia )

Chittoor, Dec 8: ఏపీలోని చిత్తూరు జిల్లాలో పెళ్లింట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని పూతలపట్టు మండలం పరిధిలో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందగా.. మరో 22 మందికి (Six killed, 22 hurt) తీవ్రగాయాలయ్యాయి. రాత్రి 10 గంటల సమయంలో పూతలపట్టు, కాణిపాకం మార్గంలోని లక్ష్మయ్య ఊరు అనే గ్రామం వద్ద ఈ దారుణ ప్రమాదం జరిగింది.

ఐరాల మండలం బలిజపల్లికి చెందిన హేమంత్‌కుమార్‌కు పూతలపట్టు మండలం జెట్టిపల్లిలో గురువారం వివాహం జరగాల్సి ఉంది. ఇందుకోసం వరుడి తరఫు బంధువులు సుమారు 30 మంది వరకు బుధవారం రాత్రి ట్రాక్టర్‌లో జెట్టిపల్లికి బయలుదేరారు. ఈ క్రమంలో పూతలపట్టు మండలం లక్ష్మయ్య ఊరు వద్ద ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తా (tractor overturns) పడింది.

గుంటూరు జిల్లాలో దారుణం, ప్రేమించలేదని బ్లేడుతో యువతి గొంతు కోసి తన చేతిని కోసుకున్న ప్రేమోన్మాది, చికిత్స పొందుతూ యువతి మృతి

ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. మృతుల్లో సురేంద్రరెడ్డి (52) (డ్రైవర్‌), వసంతమ్మ (50), రెడ్డెమ్మ (31), తేజ (25), వినీషా (3), దేశిక (2) ఉన్నారు. గాయపడ్డ వారిని అంబులెన్స్‌లో చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్‌ సురేంద్రరెడ్డి ట్రాక్టర్‌ గేర్‌ను న్యూట్రల్‌ చేసి వేగంగా వెళ్లడంతో వాహనం అదుపుతప్పి రోడ్డుపక్కనే గుంతలో దిగి బోల్తాపడింది.

సికింద్రాబాద్‌లో దారుణం.. కళ్లలో కారం కొట్టి, కత్తితో పొడిచి 14 తులాల బంగారు ఆభరణాల దోపిడీ!

గాయపడ్డవారిలో వళ్లెమ్మ (60), సోమశేఖర్‌ (25), లక్ష్మమ్మ (60), చిన్నప్ప (55), మునీశ్వరి (46), సుభాíÙణి (35), అరుణ (44), ఉదయ్‌ (35), లీలావతి (27), మాలతి (35), మాధవి(25), కృష్ణవేణి (38), యశోద (30), నవీన (26), శంకయ్య (70), హేమంత్‌ (31), వినాయక (39), సుమతి (49), మోనిక (23), కాంతమ్మ (45), అన్నపూర్ణ (43,) శోభన్‌బాబు(43) ఉన్నారు.