Tirumala, SEP 20: తిరుమలలో మరో చిరుత చిక్కింది. అలిపిరి కాలిబాట (Alipiri) మార్గంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన బోనులో బుధవారం తెల్లవారుజామున చిరుత (Leopard) చిక్కింది. వారం రోజులుగా చిరుత సంచారంపై నిఘా పెట్టిన అధికారులు పలు ప్రాంతాల్లో బోనులు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే బుధవారం తెల్లవారుజామున చిరుత బోనులో (Leopard Trapped In Cage)పడింది. దీంతో ఇప్పటివరకు ఆరు చిరుతలను బంధించినట్లు అధికారులు వెల్లడించారు.
తిరుమల నడకమార్గంలో చిక్కిన ఆరో చిరుత#TTD #tirumala #tirumalatirupatidevasthanam #Leopard #RTV #TrendingNow #APNews pic.twitter.com/ttEuGYsqEb
— RTV (@RTVnewsnetwork) September 20, 2023
చిన్నారి లక్షితపై దాడి చేసిన ప్రాంతంలోనే తాజాగా చిరుత దొరకడం గమనార్హం. పట్టుబడ్డ చిరుతను జూపార్క్‌కు తరలించేందుకు అటవీశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.