Tirupati, AUG 17: తిరుమలలో (Tirumala) మరో చిరుతపులి (Leopard) చిక్కింది. తిరుమల నడకదారిలోని లక్ష్మీ నరసింహస్వామి (Lakshmi Narasimhaswamy) ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెల 14న తెల్లవారుజామున అదే ప్రాంతంలో ఓ చిరుత చిక్కిన విషయం తెలిసిందే. ఇటీవల అలిపిరి కాలినడక మార్గంలో (Step way) చిరుత దాడి చేయడంతో నెల్లూరు (Nelloor) జిల్లాకు చెందిన ఆరేండ్ల లక్షిత (Lakshitha) అనే బాలిక మృతి చెందింది. అంతుకుముందు మరో బాలుడిని నోట కరుచుకుని వెళ్లిన చిరుతపులి.. అడవిలో వదిలేసింది. ఇలా వరుసగా దాడులు చేస్తుండటంతో మెట్ల మార్గంలోని నాలుగు ప్రాంతాల్లో అటవీశాఖ, టీటీడీ అధికారులు బోన్లను ఏర్పాటు చేశారు. ఏడో మైలు నుంచి లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయం వరకు అధికారులు నిఘాపెట్టారు. చిరుతను బంధించేందుకు అధికారులు తిరుమలకు వెళ్లే కాలినడక మార్గంలో మూడు ప్రాంతాల్లో బోనులు ఏర్పాటు చేశారు. మోకాలిమిట్ట, లక్ష్మీనరసింహస్వామి ఆలయం, 35వ మలుపు వద్ద బోన్లు ఉంచారు. మూడు రోజుల క్రితం బోనులో ఒక చిరుత పులి చిక్కింది. తాజాగా గురువారం తెల్లవారు జామున మరో చిరుత చిక్కినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.

 

మూడు రోజుల వ్యవధిలోనే రెండు చిరుత పులులు బోనులో చిక్కడంతో తిరుమలకు వెళ్లే భక్తులకు కొంత ఊపిరి పీల్చుకున్నారు. 50రోజుల వ్యవధిలోనే మూడు చిరుత పులులను బంధించినట్లు అధికారులు చెప్పారు. ఇదిలాఉంటే లక్షిత ఘటన జరిగిన మరుసటిరోజే నడకదారిలో తిరుమల కొండపైకి వెళ్లే భక్తులకు మరో చిరుత కనిపించడంతో వారు భయాందోళనకు గురయ్యారు. తిరుమల నడకదారి ప్రాంతంలో ఐదు చిరుత పులులు ఉన్నట్లు, అవి చిన్నారిని హతమార్చిన చిరుత పిల్లలు అయ్యి ఉంటాయని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు.

Stray Dog Attack: నిజామాబాద్‌లో బాలుడి మీద దాడి చేసిన వీధి కుక్క, వీడియో ఇదిగో..  

వీటిని బంధించేందుకు బోనులు ఏర్పాటు చేశారు. దీనికితోడు కాలినడక మార్గంలో తిరుపతి కొండపైకి చేరుకొనే భక్తుల భద్రతకోసం టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. మూడు రోజుల వ్యవధిలోనే రెండు చిరుత పులులు బోనుకు చిక్కాయి. కాగా, తిరుమల అడవుల్లో మొత్తం ఐదు పులులు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు.