Chandrababu

Vijayawada, June 19: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో (Govt. Junior Colleges)) చదివే నిరుపేద, మధ్యతరగతి ఇంటర్ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government) శుభవార్త చెప్పింది. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయనున్నట్టు ప్రకటించింది. ప్రభుత్వ కాలేజీలతో పాటు కేజీబీవీలు, ఏపీ మోడల్ స్కూళ్లు, ఏపీ గురుకుల పాఠశాలలు, హైస్కూల్ ప్లస్ లలో చదివే విద్యార్థులకు ఉచితంగా టెక్ట్స్ బుక్ లు పంపిణీ చేయనున్నారు. ఈ ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ పథకానికి నోడల్ ఆఫీసర్ గా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకూ గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు మాత్రమే ఉచిత టెక్స్ట్ బుక్స్  ఇస్తున్న విషయం తెలిసిందే.

తెలంగాణలో ఐటీఐ ఆధునికీకరణకు రూ.2,324.21 కోట్ల నిధులు, ఐటీఐలను ఐటీసీలుగా మారుస్తున్నామని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి

తగ్గనున్న ఆర్ధిక భారం

టెక్ట్స్ బుక్స్ తో పాటు నోట్ బుక్ లు,  బ్యాగ్ లను తెలుగు అకాడమీ నుంచి సరఫరా చేయనున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు కొంత ఆర్ధిక భారం తగ్గే అవకాశమున్నట్టు విద్యా నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

తెలంగాణలో ఒకేసారి భారీ సంఖ్యలో ఐపీఎస్ లకు స్థానచలనం.. ఏకంగా 28 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ... వివరాలు ఇవిగో!