Kurnool, November 12: ట్విట్టర్లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే టీడీపీ యువనేత,టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( TDP general secretary Nara Lokesh) అధికార పార్టీ వైసీపీ (YSR Congress Party)పై తీవ్ర విమర్శలు చేశారు. ఇసుక కొరతను పట్టించుకోని, భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలను ఎగతాళి చేసేలా జగన్ ప్రభుత్వం (Jagan Mohan Reddy government) వ్యవహరిస్తోందని లోకేశ్ ధ్వజమెత్తారు. ఇదో ఆబోతు ప్రభుత్వమని విమర్శలు గుప్పించారు.
కర్నూలుజిల్లా పత్తికొండలో సోమవారం ఆయన పర్యటించారు. ఇసుక కొరత కారణంగా ప్రాణాలు కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులు నాగరాజు, సుంకన్న కుటుంబాలను పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున చెక్కులు అందజేశారు. వారి పిల్లల భవిష్యత్‌కు టీడీపీ అండగా ఉంటుందని హామీఇచ్చారు.
నారా లోకేష్ పరామర్శ
వైసీపీ ఇసుకాసురుల ధనదాహానికి బలైన భవననిర్మాణ కార్మికులు సుంకన్న, నాగరాజుల కుటుంబాలను కర్నూలులో పరామర్శించాను. తీవ్ర శోకంలో ఉన్న ఆ కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్ధికసాయం అందించాను. ఉపాధి కరువై కుటుంబాల్ని పోషించుకోలేక కార్మికులు బలవుతున్నా ప్రభుత్వం మొద్దునిద్ర వీడకపోవడం బాధాకరం pic.twitter.com/gbSZW7jMzS
— Lokesh Nara (@naralokesh) November 11, 2019
అక్కడ టీడీపీ కార్యాలయంలో లోకేష్ మాట్లాడుతూ తమిళనాడు( Tamil Nadu), మహారాష్ట్ర(Maharashtra)ల్లోనూ భారీ వరదలు వచ్చాయని, కానీ అక్కడ ఇసుక కొరత (sand shortage) లేదని చెప్పారు. ఇక్కడ 5 నెలలుగా పనులు దొరక్క, అప్పులతో కడుపు నింపుకొంటున్న భవన నిర్మాణ కార్మికులు చివరకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
ఇసుక కొరతపై నారా లోకేష్ ధర్నా
.@ysjaganగారు.. మీ చీకటి పాలనలో ఇసుక కొరతవల్ల, కార్మికులకు పనిలేదు, తినడానికి తిండి లేదు. ఒకసారి ఈ ఆడబిడ్డ మాటలు వినండి, పని దొరక్క పస్తులుంటూ, తన పిల్లలకు కాస్తైనా బువ్వ దొరుకుతుందని అనాథాశ్రమంలో పెట్టిన పరిస్థితి. ఈ తల్లికి ఏమని సమాధానం చెప్తారు జగన్ గారు?#NoSandNoWorkInAP pic.twitter.com/1KaDSDXZMs
— Lokesh Nara (@naralokesh) August 30, 2019
ఇంట్లో పిల్లాడి సైకిల్‌ను అమ్ముకుని నిత్యావసరాలు కొనుక్కునే దుస్థితికి వారు చేరుకున్నారని వాపోయారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా ఇసుక తినేస్తున్నారంటూ తమపై ఆరోపణలు చేసిందని ఇప్పుడు పందికొక్కుల్లా పడి తింటున్నదెవరో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
2014లో శాసనసభ వేదికగా అమరావతి నిర్మాణంపై తీర్మానం జరిగిందని, అందరి ఆమోదంతోనే నిర్మాణం ప్రారంభమైందని లోకేశ్ చెప్పారు. అన్ని జిల్లాలనూ అభివృద్ధి చేయాలనే కాంక్షలో భాగంగా కర్నూలు జిల్లాకు హైకోర్టు బెంచ్, ఎయిర్‌పోర్టు, పరిశ్రమల స్థాపన తదితరాలకు టీడీపీ శ్రీకారం చుట్టిందన్నారు.
‘అమరావతి విషయంలో వైసీపీ మంత్రులు రోజుకో మాట మాట్లాడుతూ రాజధానిపై గందరగోళం సృష్టిస్తున్నారు. దీనివ్లల తెలంగాణలో భూమి ధరలు పెరిగాయి. ఇవన్నీ ప్రశ్నిస్తున్న మీడియాపై కేసులు పెడతామని ఉత్తర్వులు జారీ చేయడం అనాగరికమని అన్నారు.
మేం అధికారంలో ఉండగా తెలుగు సబ్జెక్టును ఆప్షనల్‌గా ఉంచుతూ ఇంగ్లిష్ మీడియం(English medium)ను ప్రవేశపెట్టాం. ఇప్పుడు తెలుగు మీడియంను పూర్తిగా తొలగిస్తూ.. అడిగిన వాళ్లపై ఎదురు దాడికి దిగుతున్నారు’ అని ధ్వజమెత్తారు. మద్య నిషేధం అని చెప్పిన జగన్ ప్రభుత్వం బాటిల్‌కు రూ.20 అధికంగా వసూళ్లు చేస్తూ రాష్ట్రంలో ‘జె’ ట్యాక్స్‌కు తెరదీసిందన్నారు.
దోమలపై దండయాత్రను ఎగతాళిచేసిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తన నియోజకవర్గంలో ఎంతమంది చిన్నారులు విషజ్వరాలతో చనిపోయారో తెలుసుకోవాలన్నారు. డెంగ్యూ, మలేరియాతో రాష్ట్రంలో ఇప్పటికే 2,500 మంది చనిపోయారని చెప్పారు.