APSRTC Special Services: ఏపీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌, దేవాలయాలకు ప్రత్యేక సర్వీసులు నడపాలని నిర్ణయం, టూరిస్టు గైడ్స్, వసతికోసం ప్రత్యేక ఏర్పాట్లు
APSRTC Bus. (Photo Credits: PTI | Representative Image)

Amaravati, JAN 12: ఆంధ్రప్రదేశ్ ప్రజారవాణా సంస్థ (APSRTC) ఆదాయాన్నిపెంచుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఆధ్యాత్మిక ప్రదేశాలు, దేవాలయాలు, ఇతర రద్దీ ప్రదేశాలకు ప్రత్యేక బస్సులను (special services) నడిపించాలని నిర్ణయించింది. ఇప్పటికే పలు టూరిస్టు ప్లేసులకు బస్సులను పెంచినప్పటికీ..మరికొన్ని కొత్త కొత్త ఆధ్యాత్మిక ప్రదేశాలకు బస్సు సర్వీసులను పెంచనున్నట్లు ఏపీఎస్‌ ఆర్టీసీ ఎండీ తిరుమలరావు (Tirumala rao) తెలిపారు. ఆధ్యాత్మిక ప్రదేశాలకు, ప్రాంతాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు, ప్యాకేజీలు (RTC pakage) తీసుకురానున్నామని తెలిపారు. అంతేకాదు సీజన్‌ లో డిమాండును బట్టి ప్రత్యేక బస్సులను పెంచుతామన్నారు.

ప్యాకేజీల ద్వారా ప్రయాణం చేసేవారికి అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు. టూరిజం శాఖతో సమన్వయం చేసుకుంటూ ప్రయాణికులకు ఏర్పాట్లు చేస్తామన్నారు. తిరుమలలో ఆర్టీసీ ప్రయాణికులకు సర్వదర్శనం, ప్రత్యేక దర్శనం విషయంలోనూ చర్చిస్తున్నట్లు చెప్పారు ఆర్టీసీ ఎండీ తిరుమలరావు. ఆధ్యాత్మిక ప్రదేశాలు, టూరిస్టు ప్లేసుల్లో ప్రయాణికుల సౌలభ్యం కోసం టూరిస్ట్ గైడ్స్ ను ఏర్పాటు చేస్తామన్నారు. కేవలం ఏపీలోని ఆధ్యాత్మిక ప్రదేశాలకు మాత్రమే కాదు, పొరుగు రాష్ట్రాల్లోని దేవాలయాలకుకూడా ప్రత్యేక బస్సులను నడిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.