Satyavedu MLA Koneti Adimulam (Credits: X)

Vijayawada, Sep 21: తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) సంచలనం సృష్టించిన సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం (Satyavedu MLA Koneti Adimulam) లైంగిక దాడి కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకున్నది. తనపై పోలీసులు నమోదు చేసిన కేసు కొట్టి వేయాలని ఎమ్మెల్యే ఆదిమూలం హైకోర్టు లో పిటిషన్ వేశారు. ఈ క్వాష్ పిటిషన్ విచారణలో బాధితురాలు మాట్లాడుతూ తాము రాజీకీ వచ్చామని కేసు అవసరం లేదని చెప్పడంతో అందరూ షాక్ కి గురయ్యారు. దీంతో చేసేదేమీ లేక హైకోర్టు ఈ కేసును కొట్టి వేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ విషయం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.

రెండు దశాబ్దాల్లో ఎప్పుడూ చూడని ఘోరం.. మైసూర్ ప్యాలెస్ వద్ద గజరాజుల బీభత్సం.. భయంతో జనాలు ఉరుకులు, పరుగులు (వీడియో)

అసలేం జరిగిందంటే?

సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనను లైంగికంగా వేధిస్తున్నారని ఓ మహిళా టీడీపీ నేత రెండు వారాల కిందట హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టారు. దీనికి సంబంధించిన ప్రైవేటు వీడియోలను కూడా రిలీజ్ చేశారు. దీంతో ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ టీడీపీ నిర్ణయం తీసుకుంది. బాధితురాలు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడానికి నిరాకరించినప్పటికీ పోలీసులు మీడియా కథనాల ఆధారంగా కేసులు పెట్టారు. బాధితురాలు ఫిర్యాదు చేయకపోయినా పోలీసులు తనపై కేసు పెట్టారని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు ఆదిమూలం. కాగా,  బాధితురాలు ఫిర్యాదు చేయకపోవడం, తమ క్లయింట్లు ఇద్దరూ కోర్టు బయట రాజీ పడ్డారని లాయర్లు చెప్పడంతో ఆదిమూలం వేసిన క్వాష్ పిటిషన్ డిస్పోజ్ చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.

ట్యాంకర్‌ ను అమాంతం మింగేసిన రోడ్డు.. పూణేలో షాకింగ్ ఘటన.. వీడియో మీరూ చూడండి!