Chittoor MP Daggumalla Prasada Rao on Sexual abuse Incident(X)

Vij, Jan 24:  చిత్తూరు జిల్లా నగరి (మ) కావేటిపురం గ్రామంలో చిన్నారిపై లైంగిక దాడి జరగడం బాధాకరం అన్నారు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు(MP Daggumalla Prasada Rao). చిన్నారి నుంచి శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపించాం అని... పోలీసులు వెంటనే స్పందించి నిందితుడు మోహన్ ను అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు అన్నారు.

ఆర్థిక నష్టపరిహారంపై సిఎంతో త్వరలో మాట్లాడతాను.. చిన్నారి తల్లిదండ్రులను గ్రామంలో ఎవరూ అడ్డగించలేదు అన్నారు. బాధితురాలి ఇంటి వద్ద పోలీసు బందోబస్తు నిన్న రాత్రే ఏర్పాటు చేశారు.. ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన వెంటనే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం అన్నారు.నగరిలో దారుణం.. మూడేళ్ల బాలికపై లైంగిక వేధింపులు, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన, నిందితుడిపై పోక్సో కేసు నమోదు 

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తాం అని.. చిన్నారులు, మహిళలపై లైంగిక దాడులు జరుగకుండా గ్రామాల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తాం అన్నారు. తిరుపతిలోని ప్రసూతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని పరామర్శించారు చిత్తూరు ఎంపి. బాధితురాలి కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.

Chittoor MP Daggumalla Prasada Rao on Sexual abuse Incident 

చిత్తూరు(Chittoor) జిల్లా నగరి నియోజకవర్గంలో దారుణం చోటు చేసుకుంది. మూడేళ్ల బాలికపై లైంగిక వేధింపుల(Sexual abuse)కు పాల్పడ్డాడు ఓ యువకుడు. నగరి మండలంలోని కావేటిపురం హరిజనవాడకు చెందిన మూడేళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన యువకుడు రెండు రోజుల క్రితం లైంగిక వేధింపులకు పాల్పడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.