వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీఎం వైయస్ జగన్ మలివిడత ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని వైయస్ఆర్ సర్కిల్‌లో ఆదివారం ఉదయం 10 గంటలకు నిర్వహించే బహిరంగ సభతో ఈ ప్రచార భేరి మోగించారు. నేడు మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సీఎం వైయస్ జగన్ పాల్గొననున్నారు. వైయస్ఆర్ సీపీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం తాడిపత్రిలోని వైయస్ఆర్ సర్కిల్‌లో తొలి సభ నిర్వహించారు. మధ్యాహ్నం తిరుపతి లోక్‌సభ స్థానం పరిధిలోని వెంకటగిరిలోని త్రిభువని సర్కిల్‌లో నిర్వహించిన బహిరంగసభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. అమ్మ ఒడి అంటే గుర్తుకు వచ్చేది జగన్.. విద్యాదీవెన, వసతి దీవెన అంటే గుర్తొచ్చేది మీ జగన్.. సాధ్యం కానీ హామీలు ఇచ్చారంటే చంద్రబాబు మోసం చేస్తున్నారని అర్థం.. చంద్రబాబు అమలు చేసిన ఒక్క పథకం గురించైనా చెప్పగలరా?.. చంద్రబాబును నమ్మడం అంటే పులినోట్లో తలపెట్టినట్లే అని వెంకటగిరి బహిరంగ సభలో సీఎం జగన్ పేర్కొన్నారు.
Ila chapey Dammu uanda Bob @ncbn 💥🔥
— వై.యస్.ఆర్ కుటుంబం™ Siddham (@_Ysrkutumbam) April 28, 2024
అంతేకాదు జగన్ రూపాయి ఇస్తే నాలుగు రూపాయలు ఇస్తానంటావు?.. 14 ఏళ్లు సీఎం అంటావు, నీ పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్క స్కీమ్ అయినా ఉందా?.. జన్మభూమి కమిటీలను మళ్లీ తీసుకొస్తానని చెప్పే ధైర్యం ఉందా?.. జగన్ అమ్మ ఒడి పెడితే, అంతకంటే ఎక్కువ నేను ఇస్తానంటావు?.. జగన్ తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తానని చెప్పే ధైర్యం ఉందా? అని వెంకటగిరి బహిరంగ సభలో సీఎం జగన్ పేర్కొన్నారు. బాబును నమ్మడం అంటే.. చంద్రముఖిని నిద్రలేపడమే. నా మేనిఫెస్టోను 99 శాతం అమలు చేశా. బటన్ నొక్కి రూ.2లక్షల 70 వేల కోట్లు.. ప్రజల ఖాతాల్లో వేశాం. లంచాలు లేకుండా, వివక్ష లేని పాలనను అందించాం. ఈ 58 నెలల్లోనే 2 లక్షల 30 వేల ఉద్యోగాలు ఇచ్చాం. వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చామని సీఎం జగన్ అన్నారు.
సిద్ధం సభలు గ్రాండ్ సక్సెస్ కావడం.. బస్సుయాత్ర చరిత్ర సృష్టించడంతో వైయస్ఆర్ సీపీ శ్రేణులు, అభిమానులు, సానుభూతిపరులు రెట్టించిన ఉత్సాహంతో కదం తొక్కుతున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. సీఎం వైయస్ జగన్ ఎన్నికల మలివిడత ప్రచారానికి శ్రీకారం చుడుతుండటంతో వైయస్ఆర్ సీపీ శ్రేణుల్లో నయాజోష్ నెలకొంది.