exam students

Vijayawada, July 8: ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) లో బీటెక్, ఆర్కిటెక్చర్, ఇంజినీరింగ్ కళాశాలలకు 2024-25 సంవత్సరానికి ఫీజులను ఏపీ ప్రభుత్వం ఖరారు చేసింది. ఇంజినీరింగ్‌లో (Engineering Courses Fee) బీటెక్ కోర్సులకు గరిష్ఠంగా రూ. 1. 05 లక్షలు, కనిష్ఠంగా రూ. 40 వేలు చొప్పున నిర్ణయించారు. ట్యూషన్ , అఫిలియేషన్, గుర్తింపుకార్డు, మెడికల్, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర విద్యార్థి కార్యకలాపాలు తదితర ఖర్చులన్నీ ఈ రుసుములోకే వస్తాయి. అదనంగా కళాశాలలు వసూలు చేయకూడదు. వసతి, రవాణా, మెస్, రిజిస్ట్రేషన్, ప్రవేశ రిఫండబుల్ ఫీజులు ఇందులో చేర్చలేదు.

హైదరాబాద్ ‘ది కేవ్‌ పబ్‌’లో గంజాయి పార్టీ.. దాడి చేసి 24 మందితో పాటు మేనేజర్‌ ను అరెస్టు చేసిన పోలీసులు (వీడియో)

ఏ కాలేజీల్లో ఎలా?

ఏపీలో మొత్తం 210 బీటెక్, 2 ఆర్చిటెక్చర్ ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో రూ.40 వేల రుసుము ఉన్న కళాశాలలు 114, రూ. లక్షపైన రుసుము ఉన్న కళాశాలలు 8 ఉన్నాయి. రెండు ఆర్కిటెక్చర్ కళాశాలలకు రూ.35 వేల చొప్పున రుసుము ఖరారు అయ్యింది.

ఉచిత ఇసుక పాల‌సీ అమ‌లుకు రంగం సిద్ధం, ట‌న్నుకు రూ. 88 వ‌సూలు చేయ‌నున్న ప్ర‌భుత్వం