Gautam Sawang Warns Over Fake News: ఆ నంబర్ పోలీసులది కాదు, ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవు, ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ హెచ్చరికలు, మహిళలు ఆపదలో ఉంటే 100, 112 నంబర్లకు వెంటనే కాల్ చేయండి
fake-number-social-media-name-police-department-Dont Believe says AP DGP Gautam Sawang (Photo-Facebook)

Amaravathi, December 2: జస్టిస్ ఫర్ దిషా (Justice For Disha) ఘటన తర్వాత మహిళల సెక్యూరిటీ అంశంపై దేశ వ్యాప్తంగా చర్చలు నడుస్తున్నాయి. ఆపదలో ఉన్న వేళ, పోలీసులను సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లపై ఇప్పుడు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో సైతం పోలీసులు 100, 112 నంబర్లపై ప్రచారం ప్రారంభించారు. తమ సహాయం కావాల్సి వస్తే, సంకోచించకుండా ఫోన్లో సంప్రదించాలని సూచిస్తున్నారు.అయితే పోలీసులు స్పందిస్తారా లేదా అనే సందేహంతో ఒక్కరోజే 40 వేల మంది112 నంబరుకు ఫోన్ చేసి పలు రకాల సహాయాలను కోరారు. ఇక పోలీసు మొబైల్ యాప్ (Police Mobile App) ను సైతం 30 వేల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు.

ఇదిలావుండగా, ఏపీ(Andhra pradesh)లో వాట్సప్ గ్రూపుల్లో (Whatsapp Groups) ఈ మధ్య ఓ వార్త విస్తృతంగా ప్రచారం అవుతోంది. ‘‘మహిళల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు మంచి సర్వీసు ప్రారంభించారు. మీరు ప్రయాణించే కారు, క్యాబ్‌ లేదా ఆటో నంబర్‌ను 9969777888కు ఎస్సెమ్మెస్‌ చేయండి. మీకు ఒక ఎస్సెమ్మెస్‌ వస్తుంది. మీరు ప్రయాణించే వాహనం జీపీఆర్‌ఎస్‌కు అనుసంధానం అవుతుంది. మరికొంతమంది ఆడపడుచులకు ఈ సందేశాన్ని పంపండి’’ అనేది వార్త సారాంశం.

దీనిపై ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ (AP DGP Gautam Sawang) వివరణ ఇచ్చారు. ప్రచారంలో ఉన్న 9969777888 నంబరు పోలీసులది కాదని (Fake Whatsapp Number) డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. పోలీసు శాఖ పేరిట ప్రచారం అవుతున్న ఈ నంబర్ ను తాము ఇవ్వలేదని, దీన్ని వైరల్ చేస్తున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఏపీలో పోలీసుల వద్ద 9121211100 వాట్స్ యాప్ నంబర్ ఉందని ఆయన స్పష్టం చేశారు. 100, 112లతో పాటు 181 నంబర్ ను కూడా మహిళలు వినియోగించుకోవచ్చన్నారు.

పోలీసు శాఖ పేరిట సోషల్‌ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు. ఇందుకు కారకులైన వ్యక్తులను గుర్తించి, కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ కార్యాలయం పేర్కొంది. పోలీసు శాఖ విడుదల చేసిన నంబర్లు మినహా ఇతర నంబర్లకు ఫోన్‌ చేయడం లేదా ఎస్సెమ్మెస్‌ పంపడం వంటివి చేయొద్దని పోలీసులు కోరుతున్నారు.

తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు

ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు కొందరు ఉద్దేశపూర్వకంగానే పోలీసుల పేరిట తప్పుడు మెసేజ్‌లు వైరల్‌ చేస్తున్నారు. అలాంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటాం. పోలీసులు అధికారికంగా వెల్లడించిన 100, 112, 181 (Dial 100, Dial 112, Dial 181) నంబర్లకు మాత్రమే మహిళలు ఫోన్‌ చేయాలి. మహిళల రక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ గౌతమ్‌ సవాంగ్ వెల్లడించారు.

మహిళల రక్షణకు టోల్‌ ఫ్రీ నంబర్లు

100కు ఫోన్‌ చేస్తే కాల్‌ సెంటర్‌లోని సిబ్బంది ఫిర్యాదు నమోదు చేసుకొని, వెంటనే సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం ఇస్తారు. వారి నుండి తక్షణమే సహాయం పొందవచ్చు.

112కు ఫోన్‌ చేస్తే బాధితులు ఉన్న లొకేషన్‌తో పాటు కాల్‌ ఎక్కడి నుంచి వచ్చిందో చిరునామా కూడా తెలుస్తుంది. పోలీసులు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకొని బాధితులకు రక్షణ కల్పిస్తారు.

181కు ఫోన్‌ చేస్తే రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ డైరెక్టరేట్‌ కాల్‌ సెంటర్‌కు వెళ్తుంది. మహిళలు తమ సమస్యను చెబితే పోలీసులకు సమాచారం పంపి వెంటనే అప్రమత్తం చేస్తారు.

వాట్సప్‌ నంబర్‌ 9121211100: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) ఆదేశాలతో మహిళల రక్షణ కోసం పోలీసులు ‘సైబర్‌–మహిళామిత్ర’(Mahila Mitra, Cyber Mitra) వాట్సప్‌ గ్రూపు ఏర్పాటు చేశారు. వాట్సప్‌ నంబర్‌ 9121211100 అందుబాటులో ఉంచారు. ఈ నంబరుకు వాట్సప్‌ చేస్తే, బాధితులు ఉన్న ప్రదేశానికి పోలీసులు వెంటనే చేరుకుంటారు. రక్షణ కల్పిస్తారు. దుండగుల ఆటకట్టిస్తారు.