Vij, December 22: కొడుకు వేధింపులు భరించలేక.. సుపారీ ఇచ్చి హత్య చేయించాడు ఓ తండ్రి. అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం కోళ్లబైలు పంచాయతీ దిగువ మామిడి గుంపలపల్లెకు చెందిన గంగులరెడ్డి, నారాయణమ్మ దంపతుల కుమారుడు సోమశేఖర రెడ్డి. పదేళ్ల క్రితం సోమశేఖర రెడ్డి వేధింపులు భరించలేక అతని భార్య, ఐదేళ్ల కుమారుడు బావిలో పడి ఆత్మహత్య చేసుకున్నారు.
ఈ కేసులో జైలుశిక్ష అనుభవించారు సోమశేఖర రెడ్డి, తండ్రి గంగులరెడ్డి. జైలు నుంచి బయటకు వచ్చాక కూడా సోమశేఖర రెడ్డి ప్రవర్తనలో మార్పు రాలేదు. కొడుకు ఆగడాలు భరించలేక పుంగనూరు మండలం చండ్రమాకులపల్లె పంచాయతీ గానుగలగడ్డకు చెందిన అమర్, రమేష్ అనే ఇద్దరితో రూ.40 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు తండ్రి.జగన్ బర్త్ డే వేడుకల్లో అల్లు అర్జున్ ఫోటో, ఎన్టీఆర్ జిల్లాలో జగన్‌తో పాటు బన్నీ ఫోటోను ఏర్పాటు చేసిన వైసీపీ నేతలు...వైరల్‌గా మారిన వీడియో
దీంతో అడవిలోకి తీసుకెళ్లి మద్యం తాగించి హత్య చేశాడు. పుంగనూరు సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిందితులు గంగులరెడ్డి, అమర్, రమేష్‌లను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు పోలీసులు.
Father gives supari to eliminate his son
కొడుకు వేధింపులు భరించలేక.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన తండ్రి
అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం కోళ్లబైలు పంచాయతీ దిగువ మామిడి గుంపలపల్లెకు చెందిన గంగులరెడ్డి, నారాయణమ్మ దంపతుల కుమారుడు సోమశేఖర రెడ్డి
పదేళ్ల క్రితం సోమశేఖర రెడ్డి వేధింపులు భరించలేక అతని భార్య, ఐదేళ్ల కుమారుడు… pic.twitter.com/8AonwrlDTQ
— BIG TV Breaking News (@bigtvtelugu) December 22, 2024