Vishakapatnam, Sep 15: విశాఖలో పెను ప్రమాదం తప్పింది. సముద్రంలో వేటకు వెళ్లిన ఫిషింగ్ బోటు మంటలకు దగ్ధం అయింది.ఇంజిన్ లో మంటలు ఏర్పడి పూర్తిగా బోటుకు వ్యాపించడంతో దగ్దమైందిబోటు.ఆ సమయంలో మరో ఫిషింగ్ బోటు దగ్గరలో ఉండటంతో 5 మంది క్షేమంగా బయటపడ్డారు. బోటులో వేటకు వెళ్లిన 5 మంది క్షేమంగా ఉన్నారు. సుమారు 40 లక్షలు వరకు నష్టం వాటిల్లిందని తెలిపారు మత్స్యకారులు.
విశాఖ సముద్రంలో చేపల వేటకు వెళ్లిన బోటులో అగ్ని ప్రమాద ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా తీశారు. మత్స్యకారుల పరిస్థితి అడిగి తెలుసుకున్నారు అచ్చెన్నాయుడు. ఐదుగురు మత్స్యకారులు సురక్షితంగా ఉన్నారని తెలిపారు విశాఖ మత్స్య శాఖ అధికారి విజయ.
Here's Video:
సముద్రంలో వేటకు వెళ్లిన ఫిషింగ్ బోటు మంటలకు దగ్ధం.
విశాఖ:తప్పిన పెను ప్రమాదం.సముద్రంలో వేటకు వెళ్లిన ఫిషింగ్ బోటు మంటలకు దగ్ధం.ఇంజిన్ లో ఏర్పడిన మంటలు పూర్తిగా బోటుకు వ్యాపించడంతో పూర్తిగా దగ్దమైన బోటు.ఆ సమయంలో మరో ఫిషింగ్ బోటు దగ్గరలో ఉండటంతో 5 మంది క్షేమం. బోటులో వేటకు… pic.twitter.com/97RK8eugMK
— ChotaNews (@ChotaNewsTelugu) September 15, 2024
రూ.35 లక్షల మేర ఆస్తి నష్టం జరిగి ఉంటుందని మంత్రికి తెలిపారు అధికారులు. ఇలాంటి ప్రమాదాలు భవిష్యత్తులో జరుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మత్స్యకారులకు అవగాహన పెంచాలని సూచించారు మంత్రి అచ్చెన్నాయుడు.
Here's Tweet:
విశాఖ సముద్రంలో చేపల వేటకు వెళ్లిన బోటులో అగ్ని ప్రమాద ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా.
మత్స్యకారుల పరిస్థితి అడిగి తెలుసుకున్న అచ్చెన్నాయుడు.
ఐదుగురు మత్స్యకారులు సురక్షితంగా ఉన్నారని తెలిపిన విశాఖ మత్స్య శాఖ అధికారి విజయ.
రూ.35 లక్షల మేర ఆస్తి నష్టం జరిగి ఉంటుందని… https://t.co/fzzGlX6llM pic.twitter.com/6ie6RNA5YP
— BIG TV Breaking News (@bigtvtelugu) September 15, 2024