Flood and rain losses put at Rs 6,000 crore (Photo-ANI)

Amaravati, Nov 10: ఏపీలో గత నెలలో కురిసిన కుండపోత వర్షాలు, వరదలతో దారుణంగా నష్టపోయిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో వరద నష్టం పరిశీలనకు రెండు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రానికి వచ్చిన సౌరవ్‌ రాయ్‌ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల బృందం సోమవారం ఉదయం వెలగపూడిలోని సచివాలయంలో అధికారులతో సమావేశమైంది.

ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌ నెలల్లో వాయుగుండం, అల్పపీడనాల వల్ల వర్షాలు, వరదలతో (Floods and rains) పెద్ద ఎత్తున పంటలు దెబ్బతిని రాష్ట్రానికి అపార నష్టం వాటిల్లిందని ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని (Andhra Pradesh chief secretary Nilam Sawhney) ఈ బృందానికి వివరించారు.రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకునేలా (AP Floods Aid Row) కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేసింది.

ప్రభుత్వం సకాలంలో తీసుకున్న చర్యల వల్ల్ల ప్రాణ నష్టం చాలా వరకు తగ్గించ గలిగామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా రైతులకు వెంటనే పెట్టుబడి రాయితీ పంపిణీ చేశామని, బాధిత కుటుంబాలకు తగిన సహాయం అందించామని చెప్పారు. అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రానికి ఉదారంగా సాయం అందేలా చూడాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

Check Here's Tweet

భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) నిబంధనలు సడలించి వర్షాలకు తడిసిన, రంగు మారిన ధాన్యం, వేరుశనగను రైతుల నుంచి కొనుగోలు చేసేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని కోరారు. అలాగే వివిధ రంగాలకు రూ.6,386 కోట్ల నష్టం వాటిల్లింది. తాత్కాలిక పునరుద్ధరణ సహాయ చర్యలకు రూ.840 కోట్లు, శాశ్వత పునరుద్ధణ చర్యలకు రూ.4,439 కోట్లు అవసరమని చెప్పారు.

ముంపు బాధితుల కుటుంబాలకు ఒక్కో ఇంటికి రూ.2 వేల ఆర్థిక సాయం, గోదావరి వరద పరిస్థితులపై ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్‌

2.12 లక్షల హెక్టార్లలో వ్యవసాయ, 24,516 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని.. మొత్తంగా అన్నదాతలకు రూ.1,386 కోట్ల నష్టం సంభవించిందని ఏడుగురు సభ్యుల బృందానికి సాహ్ని తెలిపారు. మొత్తంగా రోడ్లు, భవనాల శాఖకు రూ. 2,976 కోట్లు, జల వనరుల శాఖకు రూ.1,074 కోట్లు, పంచాయతీరాజ్‌ శాఖకు రూ. 781 కోట్లు, పురపాలక శాఖకు రూ.75 కోట్ల నష్టం వాటిల్లింది. ఇతరత్రా పలు శాఖలకు ఆస్తి నష్టం జరిగింది. కేంద్ర బృందం కృష్ణా, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో పర్యటించింది.