Amabti Rambabu (photo-YSRCP/X)

Vijayawada, DEC 08: ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు వేర్వేరుగా చట్టాలు అమలు అవుతున్నాయని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu ) ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సోషల్‌ మీడియాలో (Social Media) అసభ్యకరంగా పోస్టులు పెట్టారన్న ఆరోపణలపై కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులు, కార్యకర్తల మీద తప్పుడు కేసులు బనాయిస్తున్నారని పేర్కొన్నారు. వైఎస్‌ జగన్‌ (YS Jagan) , ఆయన సతీమణి భారతీపై, మాజీ మంత్రులపై సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ చేసిన టీడీపీ నాయకులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. టీడీపీకి (TDP) ఒక చట్టం, వైసీపీకి ఒక చట్టమా అంటూ నిలదీశారు. పోలీసులు తమ ఫిర్యాదులపై ఎందుకు స్పందించడం లేదని అన్నారు. గౌరవప్రదమైన పోస్టులో ఉన్న స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు కూడా వైసీపీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు.

KCR: కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం, అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యే-ఎమ్మెల్సీలకు బీఆర్ఎస్ చీఫ్ దిశానిర్దేశం  

ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు రాంగోపాల్‌ వర్మ, నటుడు పోసాని కృష్ణ మురళిపై అనామకులు ఫిర్యాదు చేయగానే వెంటనే కేసులు నమోదు చేశారని ఆరోపించారు. చట్టాలను ఉల్లంఘిస్తున్న పోలీసులపై చర్యలకు న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని అంబటి స్పష్టం చేశారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ తీరును ప్రజలు గమనించాలని కోరారు.